నిజాంపట్నం: నాటు సారా తాగటంతో జీవితాలు నాశనమవ్వటమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు అనేకం ఉన్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటు సారాతో కలిగే దుష్పరిణామాలపై నగరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం ఆధ్వర్యాన మండలంలోని దిండి పంచాయతీ యేమినేనివారిపాలెం గ్రామంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నాటు సారా వ్యతిరేక నినాదాలతో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. తామే కాకుండా తమ కుటుంబ సభ్యుల జీవితాలను సైతం పాడుచేయటం ఎంత వరకు సబబో తామే ఆలోచించాలని సూచించారు. అపరిశుభ్ర వాతావరణంలో అశాసీ్త్రయంగా తయారు చేయటంతో నాటు సారాలో ఎక్కువ మోతాదులో విషపూరిత రసాయనాలు ఉంటాయని, దీన్ని తీసుకోవటంతో ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, శరీరంలో అన్ని అవయవాలు దెబ్బతింటాయన్నారు. ఆర్థికంగా, సామాజికంగా గౌరవ మర్యాదలు కోల్పోయిన వారవతారన్నారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా చట్టరీత్యా నేరమని, ఈ నేరానికి పాల్పడిన వారికి 8 సంవత్సరాల కఠిన శిక్షతోపాటు రూ.5లక్షలు జరిమానా విధిస్తారని తెలిపారు. నాటుసారా తయారు చేసేవారికి అవసరమైన ముడిసరుకులు అందించే వారికి, విక్రయించే వారికి కూడా శిక్షలు తప్పవని చెప్పారు. గ్రామంలో నాటుసారా తయారు కాకుండా ఉండేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా నాటుసారా తయారు చేస్తున్నట్లు గమనిస్తే తమకుగాని, 9490455599, 9440902477 నంబర్లకుగాని, 14405 టోల్‌ఫ్రీ నంబరుకుగాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగరం సీఐ శ్రీరామ్‌ప్రసాద్, ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్‌ఐలు ఎస్.రామారావు, పి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరం బాపట్ల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు