నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఆటలపోటీల విషయంలో గానీ, తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి మేయర్‌కు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా అవమానిస్తూ వచ్చారు. పైగా మేయర్ వద్ద ఉన్న సిబ్బందిని కుదించి వేశారు. కారును, డ్రై వర్‌ను, అటెండర్‌ను, ఆఫీస్ స్టాఫ్‌ను, అఖరి బిళ్ల బంట్రోతును కూడా తీసేశారు. చాంబర్‌కు వస్తే తాళాలు వేసి పావుగంట సేపు బయట నిలబడేలా చేశారు. మరోవైపు మేయర్‌ను దింపివేసి తమ అభ్యర్థిని బరిలోకి నిలబెడుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర పేరును ప్రకటించారు. మేయర్ పదవిని దక్కించుకునేందుకు మిగిలిన కార్పొరేటర్లతో మంతనాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అవమానాలను నిరసిస్తూ మేయర్ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.