నాకు గోకరాజు పాలెం రెవెన్యూపరిధిలో 3.90 ఎకరాలు, మంగలపాలెం పరిధిలో 40 సెంట్లు, వాదలో ఎకరం మొత్తం కలిపి 4.90 ఎకరాల భూమి ఉంది. ఖాజీపాలెంలో మరో 16 సెంట్ల స్థలంలో ఇల్లు ఉంది. నా భర్త సూర్యనారాయణ చనిపోయారు. నాకు 80 ఏళ్లు. నలుగురు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. నా పేరుతో ఉన్న ఆస్తిని నా పెద్దకొడుకు నాకు తెలియకుండానే తన పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడు. నన్ను, మిగిలినవారిని దిక్కులేనివారిగా చేశాడు. గ్రామంలోని లైబ్రరీలో బతుకుతున్నాను. ఇంట్లో జరగకపోవడంతో పొలం పనులకు వెళ్తున్నా. అధికారులు స్పందించి నా ఆస్తిని నాకు చెందేలా చూడాలి. మూడునెలలుగా తిరుగుతున్నా.. ఫలితం లేదు.
– వారణాసి మూర్తి శ్యామల,
ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం మండలం