రేపల్లె రూరల్: తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ రేపల్లె మండలం పేటేరు గ్రామ ప్రజలు శుక్రవారం రెండవ రోజు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని మహిళలు, చిన్నారులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. షాపు ఏర్పాటు ఆలోచనను విరమించుకునేంత వరకు పోరాటం చేస్తామని మహిళలు తెలిపారు. గంటకుపైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ సీఐ మల్లికార్జునరావు వచ్చి మహిళలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఆర్డీవో, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, తహసీల్దార్, డీఎస్పీ కార్యాలయాకు స్థానికులు వెళ్లి వినతిపత్రాలు అందజేశారు.
మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన