చందోలు(కర్లపాలెం): చందోలు బగళాముఖి అమ్మ వారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావులు వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం వారు కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ–4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని చూసి, పలు సూచనలు చేశారు. అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో మార్చి 25, 26వ తేదీలలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆమె వెంట ప్రొటోకాల్ డైరెక్టర్ మోహరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీఆర్‌డీఏ పీడీ విజయ లక్ష్మి, పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, జిల్లా ఉపాధి కల్పనాధికారి దుర్గాబాయి, గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తుళ్ళూరు తహసీల్దార్ సుజాత తదితర అధికారులు పాల్గొన్నారు.
వయోజన విద్య, రాత్రి బడి పరిశీలన
తాడికొండ: తాడికొండ మండలంలో కొనసాగుతున్న వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాలను ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని నాలుగు కేంద్రాలను పరిశీలించిన వారు వయోజన విద్య, రాత్రి బడి కార్యక్రమం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 50 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 510 మంది చదువుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్య ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు నేర్చుకున్న అక్షరాలు, విద్యపై పరీక్ష నిర్వహించారు. వాటిని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించి, హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అడల్ట్ ఎడ్యుకేషన్ బ్యూరో కన్సల్టెంట్ అధికారి జగన్ మోహన్ రావు, సభ్యులు ఓంకారం, శిరీష, దాసరి వెంకటస్వామి ఎంపీడీవో కె.సమతా వాణి, ఏపీఎం సాంబశివరావు, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎద్దు వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
రాజుపాలెం: మండలంలోని మొక్కపాడు గ్రామ సమీపాన ఎద్దువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వంతెనను రూ.5.66 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు దుర్గేష్‌రావు, ఎంపీడీవో జీవీ సత్య నారాయణ, కూటమి నేతలు పాల్గొన్నారు.
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు