బస్సు కింద ఇరుక్కుపోయిన వృద్ధ జంట కాపాడిన వాహన చోదకులు
బాపట్ల టౌన్: ఆగి ఉన్న బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన మండలంలోని అసోదివారిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. అసోదివారిపాలెం సమీపంలో హైవేపై స్కూల్ బస్సు నిలిచి ఉంది. అదే సమయంలో చీరాల నుంచి బైకుపై కర్లపాలెం వెళ్తున్న వృద్ధ దంపతులు అదుపుతప్పి బస్సును ఢీకొట్టారు. బస్సు కింది భాగంలోకి టీవీఎస్ ఎక్స్‌ఎల్ దూసుకెళ్లి ఇరుక్కుపోయారు.
వాహనచోదకులు తక్షణమే స్పందించి వారిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. వారు కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.