
చిన్నారికి వైఎస్సార్ సీపీ నేతల నివాళి
గుంటూరురూరల్: కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నియోజకవర్గ ఇంచార్జ్ బలసాని కిరణ్‌కుమార్ తదితరులు సోమవారం సందర్శించి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె మృతదేహాన్ని సందర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజా ప్రతినిధులకుగానీ, కమిషనర్‌కు గానీ అడ్మినిస్ట్రేషన్‌పై నిబద్ధత లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలి కమిషనర్ సైతం టీడీపీ నాయకులతో కలిసి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో జీజీహెచ్‌లో ఎలుకలు కరిచి చిన్నారి, నేడు కుక్కల దాడిలో మరో చిన్నారి మృత్యువాతకు గురయ్యాడన్నారు.