
మార్షల్ ఆర్ట్స్‌లో బాపట్ల క్రీడాకారులకు బంగారు పతకాలు
బాపట్ల: కుడో కాంబాబు మార్షల్ ఆర్ట్స్‌లో బాపట్ల జిల్లాకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించినట్లు కోచ్ కె.దివ్యతేజ పేర్కొన్నారు. మంగళవారం క్రీడాకారుల సన్మాన కార్యక్రమం అకాడమీలో జరిగింది. కోచ్ దివ్యతేజ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి శశిధర్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీన అనకాపల్లి జిల్లా పరవాడలో ఒకటో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్‌లో 80 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. బాపట్ల జిల్లా తరఫున 11 సంవత్సరాల బాలుర విభాగంలో కె.శ్రీ షణ్ముఖ, 12 సంవత్సరాల బాలుర విభాగంలో శ్రీకృష్ణ బంగారు పతకాలు సాధించారని తెలిపారు. మే నెలలో జరిగే అంతర్జాతీయ పోటీలు పూణెలో జరుగుతాయని వీటిలో పాల్గొనేందుకు అర్హత సాధించారని తెలిపారు. సభలో ఆంధ్రప్రదేశ్ కుడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అడే కిరణ్‌కిషోర్, జనరల్ సెక్రెటరీ బి.రవిబాబు, ట్రెజరర్ ఎ.అనురాధ తదితరులు పాల్గొన్నారు.