హరితదళంతో చైతన్యపర్చాలి
మణుగూరు రూరల్ : హరితదళాలతో గ్రామాలను చైతన్యపర్చాలి జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు అన్నారు. మండల పరిధిలోని సాంబాయిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న నేచర్ క్యాంప్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పేరంటాల చెరువు, బుగ్గ, బీటీపీఎస్, రామానుజవరం వద్ద గోదావరి నదీ పరివాహకం తదితర ప్రాంతాలను చూపించడంతో పాటు వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్‌ఓ మాట్లాడుతూ.. ప్రకృతి ఉగ్రరూపాన్ని ప్రపంచంలో ఎవరూ తట్టుకోలేరనడానికి అమెరికా, ఫ్రాన్స్ దేశాలే నిదర్శనమని అన్నారు. అనంతరం స్థానిక పీవీ కాలనీలోని సింగరేణి పాఠశాలను చలపతిరాజు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌జీఓ రీసోర్స్ పర్సన్ రాజశేఖర్, పాఠశాల హెచ్‌ఎం ఎం. శ్రీలత, గైడ్ టీచర్ బి. కోటేశ్వరరావు, బి. రామిరెడ్డి, రాము, కె రామారావు, కోటేశ్వరరావు, పరమయ్య పాల్గొన్నారు.
డీఎస్‌ఓ చలపతిరాజు
Comments
Please login to add a commentAdd a comment