కొత్తగూడెంటౌన్: కోర్టులో విచారణకు హాజరైన వ్యక్తిపై దాడికి పాల్పడినందుకు పాల్వంచ వెంకటేశ్వరకాలనీకి చెందిన కొడాలి నర్మదకు ఏడాదిన్నర జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.సుచరిత తీర్పు చెప్పారు. 2017, ఫిబ్రవరి 28న కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు విచారణలో భాగంగా హాజరైన పాల్వంచ మండలం ఇల్లెందులపాడుకు చెందిన గుగులోత్ మాన్‌సింగ్‌ను.. కోర్టు హాల్‌లో జడ్జి ఎదుట కొడాలి నర్మద బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. ఈ ఘటనపై అప్పటి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.జమలేశ్వరావు, కోర్టు సూపరింటెండెంట్ రషీద్‌అలీఖాన్ 2017 మార్చిలో కొత్తగూడెం వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ ధాఖలు చేయగా.. ఏడుగురు సాక్షులను విచారించి, కొడాలి నర్మదపై నేరం రుజువైనందున జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ నాగలక్ష్మి వాదించగా.. నోడల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, లైజన్ ఆఫీసర్ అబ్దుల్ ఘని, కోర్టు పీసీ కామేశ్ సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment