
ఒత్తిడిని దూరం చేసేందుకే క్రీడాపోటీలు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకే విశ్వవిద్యాలయం స్థాయిలో క్రీడాపోటీలను నిర్వహించామని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆల్థాస్ జానయ్య పేర్కొన్నారు. శుక్రవారం అశ్వారావుపేట కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జోన్‌స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. వృత్తి రీత్యా ఉండే ఒత్తిడిని తగ్గించేందుకు బోధన సిబ్బందికి ఈ పోటీలను నిర్వహించామని, వారిలోని నైపుణ్యం ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికని పేర్కొన్నారు. దేశానికి అన్నం అందించే రైతుకు మరిన్ని సేవలు అందిస్తే ప్రయోజనకరమని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్యాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడా, సాహిత్య పోటీల్లో విజేతలకు వైస్ చాన్స్‌లర్ బహుమతులు అందించారు. తర్వాత జిమ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ జె.సురేశ్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, జి.గోపాలకృష్ణమూర్తి, శిరీష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment