
జేసీబీ, ఐదు ట్రాక్టర్లు సీజ్
జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు గ్రామ పంచాయతీ పంతులుతండా గ్రామ సమీపంలోని పెద్దవాగు ఇసుకను అక్రమంగా జేసీబీతో తవ్వి, ఐదు ట్రాక్టర్లతో తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. చింతలతండాకు చెందిన భూక్యా రాందాస్ పెద్దవాగులోని ఇసుకను జేసీబీతో తవ్వి, ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్‌ఐ రవి తన ఘటనా స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. వాహనాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, కొత్తగూడెంకు చెందిన జేసీబీ డ్రైవర్ పగడాల వేణు, భేతాళపాడు జీపీ టాక్యాతండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు ధరావత్ రాందాస్, నునావత్ భీమా, బానోత్ కస్నా, గుగులోత్ సక్రు, ట్రాక్టర్ యజమానులు బానోత్ లక్ష్మణ్, బానోత్ కస్నా, బానోత్ అనిత, చింతలతండాకు చెందిన భూక్యా రాందాస్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రవి తెలిపారు.
తొమ్మిది మందిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment