సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శని, ఆదివారాల్లో జరగనున్న కోలిండియా స్థాయి (పురుషులు, మహిళలు) అథ్లెటిక్స్ మీట్‌కు సింగరేణి కార్పొరేట్ ఏరియా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ టోర్నీ 38 ఈవెంట్లలో జరగనుండగా కోలిండియా పరిధిలోని బొగ్గు పరిశ్రమల నుంచి 284 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. సింగరేణి చరిత్రలో కొత్తగూడెంలో కోలిండియా స్థాయి టోర్నీ జరగడం ఇది రెండోసారి. ఈ పోటీలను శనివారం సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు ప్రారంభించనుండగా, ఆదివారం సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారని అధికారులు తెలిపారు. కాగా, పోటీల ఏర్పాట్లను జీఎం పర్సనల్(ఐఆర్‌పీఎం) కవితానాయుడు శుక్రవారం సాయంత్రం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆమె వెంట అధికారులు రాజీవ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, బి.రాజగోపాల్, శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment