అపురూపం | - | Sakshi
Sakshi News home page

అపురూపం

Published Sat, Feb 22 2025 12:25 AM | Last Updated on Sat, Feb 22 2025 12:25 AM

అపురూపం

అపురూపం

కవలలు (ట్విన్స్‌) ఎక్కడున్నా ప్రత్యేకత ఉంటుంది. రూపంలో ఒకేరకంగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా చూస్తారు. ఒకే రకమైన దుస్తులు, వస్తువులు కొనిపెట్టి అపురూపంగా చూసుకుంటారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉంటే మరికొందరిలో భిన్నంగా ఉంటాయి. బంధువులు, టీచర్లు, ఇరుగుపొరుగు వారు కూడా గుర్తుపట్టలేక తికమకపడుతుంటారు. ప్రపంచంలో మొదటి సారి కవలలు దినోత్సవాన్ని పోలండ్‌లో 1976లో నిర్వహించారు. మోజస్‌, అరన్విల్కార్స్‌ కవలలు ఒకే వ్యాధితో బాధపడుతూ ఒకే రోజు (ఫిబ్రవరి 22) మరణించారు. ఈ రోజున ప్రపంచ కవలల దినోత్సవంగా పోలాండ్‌ ప్రకటించగా పలు దేశాలు అంగీకారం తెలిపాయి. – పాల్వంచరూరల్‌/కరకగూడెం

ఎక్కడున్నా కవలలకు ప్రత్యేక గుర్తింపు ఒకే పోలికలతో పలు సందర్భాల్లో తికమక

నేడు కవలల దినోత్సవం

అభిరుచులు ఒక్కటే..

కుంజ అభిరాం, లక్ష్మణ్‌పార్థు

పాల్వంచ మండలం దంతలబోరు పంచాయతీ గంగాదేవిగుప్ప గ్రామానికి చెందిన కవలలు కుంట అభిరాం, లక్ష్మణ్‌పార్థు గ్రామంలోనే 4వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉంటాయి. ఏదికొన్నా ఇద్దరికీ సమానంగా ఇవ్వాల్సిందే. చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారని తల్లిదండ్రులు భద్రం, వెంకటరమణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement