
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే ఎండ వేడి మొదలై పగటి పూట తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంఅర్బన్: ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికా రులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించా రు. అక్రమంగా ఇసుక, గంజాయి రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్లను గుర్తించాలని, గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు. అన్ని ఠాణాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, చంద్రభాను, మల్లయ్య స్వామి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
పాల్వంచరూరల్: సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి, 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధ సమన్వయ అధికారి అనిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 18 కేంద్రాల్లో 5,130 మంది పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
శ్రీవారికి అభిషేకం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భగుడిలో మూలవిరాట్‌తోపాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మ వార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించగా, భక్తుల సమక్షాన పల్లకీ సేవ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment