
ద్వారకా తిరుమలకు పాదయాత్ర
అశ్వారావుపేటరూరల్: ద్వారకా తిరుమల క్షేత్రానికి అశ్వారావుపేటలోని శ్రీ షిరిడీ సాయిబాబా భక్తులు శనివారం పాదయాత్రగా బయల్దేరారు. స్థానిక బాబా ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం 30 మంది భక్తులు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్న ద్వారకా తిరుమల ఆలయానికి కాలినడకన తరలివెళ్లారు. కాగా, స్వామి వారి ఆలయానికి సాయిబాబా భక్తులు పాదయాత్రగా వెళ్లడం ఇది ఎనిమిదోసారి అని సాయిసేవా సమితి బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు హరి, టి.అప్పారావు, కర్నాటి శ్రీను, స్వప్న, రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment