
విద్యార్థుల సంక్షేమానికి చర్యలు
మణుగూరు రూరల్ : గిరిజన విద్యార్థుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులకు సూచించారు. మణుగూరు గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ.1.80 కోట్లతో చేపడుతున్న 12 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం జీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ఉద్దీపకం వర్క్ బుక్స్ పాఠ్యాంశాలను విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆ తర్వాత మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ ప్రాంతంలో ఐటీడీఏ హౌసింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలీస్ కౌన్సెలింగ్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. నెలరోజుల్లోగా పనులు పూర్తిచే యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, డీఈ మధుకర్, ఏఈలు ప్రసాద్, యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రతిభా పరీక్ష
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 55 ఆశ్రమ పాఠశాలలు, 12 గిరిజన గురుకులాల నుంచి 335 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు. భద్రాచలం, అంకంపాలెం, ఖమ్మం ఏజీహెచ్‌ఎస్‌లతో పాటు పాల్వంచ, బుజ్జిగూడెం ఏహెచ్‌ఎస్‌ల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరు సబ్జెక్టుల్లో 25 చొప్పున 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలో టాపర్లకు నగదు పురస్కారం అందజేస్తామని, పదో తరగతి తర్వాత సైతం వారు మెరుగైన కాలేజీలు ఎంచుకునేలా అండగా నిలిచి స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తామని పీఓ తెలిపారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment