చిన్నారులకు సౌకర్యాలు కల్పించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి
భద్రాచలంటౌన్: శిశు గృహలోని చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. భద్రాచలంలోని శిశుగృహను గురువారం ఆమె సందర్శించారు. చిన్నారులకు అందుతున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పెషల్ సబ్ జైల్‌ను పరిశీలించి ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. జైలు జీవితం గడిపిన ప్రతీ ఒక్కరు పూర్తి పరివర్తన చెందాలని, విడుదలయ్యాక ప్రశాంత జీవితం గడపాలని సూచించారు. ఆ తర్వాత సరోజిని వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
8న లోక్ అదాలత్..
మార్చి 8వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలని భానుమతి సూచించారు. భద్రాచలం జ్యుడీషియల్ కోర్టు పరిధిలోని పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment