రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
హైకోర్టు ఏజీపీగా
భద్రాచలం వాసి
భద్రాచలం: రాష్ట్ర హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా భద్రాచలానికి చెందిన సాల్మన్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం బార్ అసోసియేషన్‌లో సీనియర్ న్యాయవాదిగా సాల్మన్ రాజ్ పనిచేశారు. భద్రాచలం మొబైల్ కోర్టులో ఆరేళ్ల పాటు ఏజీపీగా పని చేసిన అనుభవం ఉంది. కాగా సాల్మన్‌రాజ్‌ను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట దేవదానం తదితరులు అభినందించారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం సహకారనగర్: 2024–డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని బోధన మెరుగుపర్చుకోవాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణ సూచించారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో ఎస్‌జీటీలకు ఇస్తున్న శిక్షణను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతీ సబ్జెక్టులో కనీస అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా బోధన జరగాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుందని చెప్పారు. తొలుత ఎన్నెస్సీ కాలనీలో ఎఫ్‌ఎల్‌ఎన్ తీరు, డైట్ కళాశాలలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. విద్యాశాఖ ఏఎంఓ రవికుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ
రామయ్యకు ముత్తంగి అలంకరణ
Comments
Please login to add a commentAdd a comment