సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్‌లో ఆయన ఆర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అఽఽధికారులకు అందజేసి అర్హతల మేరకు పరిష్కరించాలని సూచించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
లక్ష్య సాధనకు కృషి చేయాలి..
దుమ్ముగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు.. లక్ష్యాలు ఏర్పాటుచేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని పీఓ రాహుల్ అన్నారు. సోమవారం ఆయన రామచంద్రునిపేట బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఇప్పటి నుంచే కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తాను చదువుకునే రోజుల్లో పైలెట్ కావాలని అనుకునేవాడినని, కానీ ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి తమ పాఠశాలకు రాగా, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని అనుకున్నానని, ఆ మేరకు లక్ష్యాన్ని సాధించానని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ సమ్మయ్య, తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, హెచ్‌ఎంలు నరసింహారావు, బట్టు రాములు, సోమశేఖర్, నరేందర్, సర్వేశ్వర దొర, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, ఐటీడీఏ ఈఈ చంద్రశేఖర్, ఏపీఓ వేణు, లక్ష్మీనారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మనిధర్, ఎఫ్‌డీసీ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment