ములకలపల్లి : మండల పరిధిలోని కమలాపురం సీతారామ పంప్‌హౌస్– 3 నుంచి గోదావరి జలాలు దిగువకు తరలాయి. ఇక్కడి మోటార్ ద్వారా నీళ్లు ఎత్తిపోయగా, గ్రావిటీ ద్వారా ఏన్కూర్ లింక్ కెనాల్‌కు తరలివెళ్లాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రంలోగా గోదారి నీళ్లను సాగర్ కాల్వలో కలుపుతామని మంత్రి తుమ్మల ప్రకటించిన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నీటి తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక్కడ మోటార్లను ప్రారంభించగా, ఆరు నెలల్లోనే నీళ్లు ఎత్తిపోయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment