
120 కిలోల బెల్లం పట్టివేత
జూలూరుపాడు: మండల కేంద్రం జూలూరుపాడులోని ఓ కిరాణ దుకాణం, ఇంటిపై ఎకై ్సజ్‌శాఖ పోలీసులు సోమవారం దాడులు చేశారు. కిరాణ దుకాణం నిర్వాహకుడు మణికంఠ నాటు సారా తయారీకి వినియోగించే బెల్లం, పటిక విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎకై ్సజ్‌శాఖ కొత్తగూడెం సీఐ ఎల్.జయశ్రీ ఆధ్వర్యాన పోలీసులు దాడి చేశారు. దీంతో మణికంఠ జూలూరుపాడుకు చెందిన ఎం.సుమన్ ఇంట్లో బెల్లం, పటిక, నాటు సారా నిల్వ చేశారని పోలీసులు గుర్తించి 120 కిలోల బెల్లం, 25 కిలోల పటిక, 2.5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ, సుమన్‌లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీహరి, హెడ్ కానిస్టేబుళ్లు ప్రకాష్‌రావు, ముత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరిపై కేసు నమోదు