
తునికాకు సేకరణపై చిగురిస్తున్న ఆశలు
పాల్వంచరూరల్: ఎట్టకేలకు ఈ ఏడాది తునికాకు సేకరణకు ఆశలు చిగురిస్తున్నాయి. తునికాకు సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మూడు సార్లు ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించగా భద్రాద్రి జిల్లాలోని 31 యూనిట్లకు 26 యూనిట్లలో ఖరారయ్యాయి. ఫిబ్రవరి 27, 28, మార్చి 10, 11వ తేదీల్లో 20, 21వ తేదీల్లో మూడు దఫాలుగా టెండర్లు ఆహ్వానించారు. జిల్లాలో ఈ ఏడాది 17,200 స్టాండర్డ్ బ్యాగ్‌ల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు భద్రాచలం డివిజన్‌లో ఐదు యూనిట్లకు గాను మూడు, మణుగూరు డివిజన్‌లోని ఐదుకు ఐదు, పాల్వంచ డివిజన్‌లో నాలుగుకు నాలుగు, వైల్డ్‌లైఫ్ డివిజన్ పరిధిలో ఐదు యూనిట్లకు ఐదు, కొత్తగూడెం డివిజన్ పరిధిలో నాలుగుకు ఒకటి, ఇల్లెందు డివిజన్‌లో ఎనిమిది యూనిట్లకు ఎనిమిది యూనిట్లను కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. మొత్తం కాకున్నా మెజార్టీ యూనిట్లు అమ్ముడైనందున తునికాకు సేకరణ ఆశించిన స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం డివిజన్‌లో రెండు, సత్తుపల్లిలోని మూడు యూనిట్లపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో తునికాకు సేకరణకు మరోమారు టెండర్లు పిలుస్తారా, వదిలేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
జిల్లాలో పలు యూనిట్ల ఖరారు