మా పెళ్లి మొదటి పత్రిక మీకే.. | Pulkit Samrat Breaks Silence on His Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి సిద్ధమవ్వనున్న మరో బాలీవుడ్‌ జంట

Published Thu, Nov 12 2020 8:02 PM | Last Updated on Thu, Nov 12 2020 8:55 PM

Pulkit Samrat Breaks Silence on His Marriage - Sakshi

బాలీవుడ్‌ నటులు పులకిత్‌ సామ్రాట్‌, కృతి కర్భందాల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ లానే ఆఫ్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ కూడా ఎప్పుడూ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ఉంటుంది. బాలీవుడ్‌ హాట్‌ జోడీల లిస్ట్‌లో వీరి జంట కూడా ఒకటి. ఐతే, గత ఏడాదిన్నరగా వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయం విధితమే. కాగా వీరు  ప్రేమలో ఎంతగా మునిగిపోయారనేది ఈ నటుడు మరోసారి నిరూపించాడు.  తన సోదరి ఇంట్లో దీపావళి పండగ జరుపుకోడానికి వెళ్లిన పులకిత్‌, కృతిని చాలా మిస్‌ అవుతున్నట్టుగా తెలిపాడు. వీరిరువురు లాక్‌డౌన్‌ని కలిసి గడిపినా, ఇప్పుడు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు.

అందుకే ఈ దీపావళికి వారిరువురు కలుసుకోలేకపోతున్నారు. ‘‘ఈ పండుగ సమయంలో తను నాతో లేనందున, చాలా మిస్‌ అవుతున్నాను. కార్డ్స్‌ ఆడటమంటే నాకు అంతగా ఇష్టం లేకపోయినా, తనకు మాత్రం చాలా ఇష్టం. ఇప్పుడు మేము అదే ఆట ఆడుతున్నా,  తాను మా పక్కన లేదు’’  అని పులకిత్‌ షేర్‌ చేశాడు. 

కాగా, ఓ ఇంటర్వూలో పెళ్లెప్పుడని యాంకర్‌ ప్రశ్నించగా, ‘‘కృతి, నేను ప్రేమలో ఉన్నాం. మా సోదరుని అనుమతి కోసమే వెయిట్‌ చేస్తున్నాం. ఐనా, ఇప్పుడు మేము మా కెరీర్‌పై దృష్టి సారించాం. మా మొదటి ప్రాధాన్యత కేవలం మా వృత్తిపైనే ఉంటుంది. ఒకవేళ వివాహానికి తేదీని ఫిక్స్‌చేస్తే ముందుగా మీకే పత్రిక పంపిస్తామని’’ చిరునవ్వు చిందించారు. ఇక పులకిత్‌ సామ్రాట్‌, కృతి జంటగా పాగల్‌ పంతీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నటి తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్‌ హీరోగా తెరకెక్కిన బోణీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌తో తీన్‌మార్‌లో జంటగా కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement