కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి వీలు కల్పించే ఆలయ కారిడార్‌ల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత పర్యాటక రంగం బాగా పెరిగింది.
2021లో ఆధ్యాత్మిక పర్యాటకుల సంఖ్య 677 మిలియన్లు. ఇది 2022 నాటికి 1439 మిలియన్లకు పెరిగింది. ఆదాయం కూడా 7.9 మిలియన్ డాలర్ల నుంచి.. 16.2 మిలియన్ డాలర్లకు పెరిగిందని పర్యాటకశాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఈ రంగంలో జీవనోపాధి కూడా పెరుగుతోందని వెల్లడించారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో వంద మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
హై-స్పీడ్ రైళ్ల ద్వారా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, చిన్న నగరాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కృషి చేశాయి.
విదేశీ పర్యాటకుల కోసం మాల్స్, షాప్స్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలకు వడ్డీ రహిత ఋణాలు మంజూరు చేశారు. ఈ రకమైన అభివృద్ధిని ఆర్థిక ప్రోత్సాహకంగా మాత్రమే కాకుండా, మరింతగా చూడటం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు ఆధ్యాత్మిక శ్రేయస్సును కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment