న్యూఢిల్లీ: ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత విషయంలో భారతీయ వ్యాపార సంస్థలు బాధ్యతాయుత పద్ధతులు, విధానాలను అవలంభిస్తున్నట్టు నాస్కామ్ సర్వేలో తేలింది. అటువంటి పద్ధతులు, విధానాల అమలుకు చర్యలను ప్రారంభించినట్టు 60 శాతం కంపెనీలు తెలిపాయి. వీటిలో 89 శాతం వ్యాపార సంస్థలు శ్రామికశక్తి సున్నితత్వం, శిక్షణలో పెట్టుబడులను కొనసాగించడానికి నిబద్ధతగా ఉన్నాయి.
భారత్‌లో ఏఐ వాణిజ్య అభివృద్ధి, వినియోగంలో నిమగ్నమైన పెద్ద సంస్థలు, ఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు చెందిన 500 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ‘బాధ్యతాయుత ఏఐ ఆవశ్యకతపై ప్రాథమిక అవగాహన కలిగి ఉన్నట్లు 30 శాతం సంస్థలు వెల్లడించాయి. ఏఐ వినియోగదారులు, వాటాదారులలో బాధ్యతాయుత ఏఐ కోసం పెరుగుతున్న అవసరం పరిశ్రమ నాయకులకు అధునాతన సాధనాలు, వ్యూహాలలో పెట్టుబడులతోపాటు ఏఐ పద్ధతులలో పారదర్శకతను నొక్కి చెబుతోంది’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment