Nasscom survey
-
బాధ్యతాయుతంగా ఏఐ స్వీకరణ
న్యూఢిల్లీ: ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత విషయంలో భారతీయ వ్యాపార సంస్థలు బాధ్యతాయుత పద్ధతులు, విధానాలను అవలంభిస్తున్నట్టు నాస్కామ్ సర్వేలో తేలింది. అటువంటి పద్ధతులు, విధానాల అమలుకు చర్యలను ప్రారంభించినట్టు 60 శాతం కంపెనీలు తెలిపాయి. వీటిలో 89 శాతం వ్యాపార సంస్థలు శ్రామికశక్తి సున్నితత్వం, శిక్షణలో పెట్టుబడులను కొనసాగించడానికి నిబద్ధతగా ఉన్నాయి. భారత్‌లో ఏఐ వాణిజ్య అభివృద్ధి, వినియోగంలో నిమగ్నమైన పెద్ద సంస్థలు, ఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు చెందిన 500 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ‘బాధ్యతాయుత ఏఐ ఆవశ్యకతపై ప్రాథమిక అవగాహన కలిగి ఉన్నట్లు 30 శాతం సంస్థలు వెల్లడించాయి. ఏఐ వినియోగదారులు, వాటాదారులలో బాధ్యతాయుత ఏఐ కోసం పెరుగుతున్న అవసరం పరిశ్రమ నాయకులకు అధునాతన సాధనాలు, వ్యూహాలలో పెట్టుబడులతోపాటు ఏఐ పద్ధతులలో పారదర్శకతను నొక్కి చెబుతోంది’ అని నివేదిక వివరించింది. -
నాస్కామ్-డెలాయిట్ సర్వే: ఎమర్జింగ్ ఐటీ సిటీ విశాఖపట్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు నాస్కామ్–డెలాయిట్ సంయుక్త సర్వే వెల్లడించింది. దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను పెద్ద నగరాలు కంటే చిన్న నగరాలకు విస్తరించడానికి మొగ్గుచూపుతున్నాయని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ విస్తరణకు ఐదు కీలక అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా 26 ఎమర్జింగ్ ఐటీ హబ్స్‌ను నాస్కామ్–డెలాయిట్ ఎంపిక చేసింది. ఇందులో మన రాష్ట్రం నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి వరంగల్ ఎంపికైంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్్క–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖ నగరాన్ని ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. విశాఖలో మొత్తం 1,120 స్టార్టప్స్ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటిలో 20 శాతానికిపైగా స్టార్టప్స్ టెక్నాలజీ రంగానికి చెందినవే ఉన్నాయి. ఇప్పటికే 250కి పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు విశాఖ వేదికగా పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడలో 80కి పైగా టెక్నాలజీకి చెందిన స్టార్టప్స్ ఉండగా, 550కి పైగా టెక్నాలజీ ఆధారిత వ్యాపారసంస్థలు ఉన్నాయి. చదవండి: వియ్యంకుల వారి భూ విందు అంతేగాకుండా ఏటా 25 వేలమందికి పైగా ఐటీ నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు. ఐటీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ముందువరుసలో ఉంటోంది. తిరుపతిలో ఇప్పటికే 25 టెక్నాలజీ స్టార్టప్స్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, 50కి పైగా టెక్నాలజీ బేస్డ్ సంస్థలున్నాయి. ఇవన్నీ ఈ మూడు నగరాల్లో పెట్టుబడులను పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. 30% వ్యయం తక్కువ పెద్ద నగరాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ద్వితీయశ్రేణి నగరాల్లో లభిస్తుండటం, రియల్ ఎస్టేట్ ధరలూ తక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు ఈ 26 నగరాల్లో కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ప్రధాన కారణమని నాస్కామ్–డెలాయిట్ పేర్కొంది. పెద్ద నగరాలతో పోలిస్తే మానవ వనరుల వ్యయం 25 నుంచి 30 శాతం తగ్గుతున్నట్లు తెలిపింది. దేశీయ ఐటీ నిపుణుల్లో 15 శాతం ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల నుంచి వస్తున్నవారే కావడంతో వారి వద్దకే కార్యాలయాలను తీసుకెళ్లే యోచనలో కంపెనీలున్నాయి. రియల్ ఎస్టేట్ భవనాలు, అద్దెల వంటివీ చిన్న నగరాల్లో తక్కువగా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐటీ కంపెనీలు టైర్–2 సిటీస్ బాట పడుతున్నట్లు ఆ నివేదిక విశ్లేషించింది. -
కొత్తగా 4.5 లక్షల కొలువులు..సానుకూలంగా రిక్రూట్మెంట్స్..!
ముంబై: కరోనా మహమ్మారి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా డిజిటైజేషన్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం 227 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. దశాబ్దకాలంలోనే అత్యధిక స్థాయిలో 15.5 శాతం వృద్ధి నమోదు చేయనుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వ్యూహాత్మక సమీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది. మహమ్మారి పరిణామాలు తలెత్తిన వెంటనే పరిశ్రమ దీటుగా ఎదురునిల్చిందని, మరుసటి ఏడాది గణనీయంగా పుంజుకుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ పేర్కొన్నారు. కోవిడ్ పూర్వం కన్నా రెట్టింపు స్థాయి వృద్ధి సాధించనుందని ఆమె తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. నాస్కామ్ ప్రకారం.. 2021–22లో కొత్తగా 4.5 లక్షల కొత్త కొలువులు రావడంతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య మొత్తం 51 లక్షలకు చేరనుంది. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో 44 శాతం వాటాతో.. మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 18 లక్షలుగా చేరుతుంది. 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు.. కొన్నాళ్లుగా వృద్ధి అంచనాలను ప్రకటించడాన్ని నిలిపివేసిన నాస్కామ్.. తాజా పరిణామాల దన్నుతో దేశీ ఐటీ పరిశ్రమ 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరగలదని ధీమా వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన సామర్థ్యాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఘోష్ పేర్కొన్నారు. దీనికోసం విధానకర్తలు కూడా కొంత తోడ్పాటు అందించాలని కోరారు. తొలి 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించడానికి పరిశ్రమకు 30 ఏళ్లు పట్టగా, రెండో బిలియన్ డాలర్ల మార్కును దశాబ్దకాలంలోనే సాధించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, ఐటీ పరిశ్రమ వృద్ధిని స్వాగతించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..పరిశ్రమకు అవసరమైన పూర్తి మద్దతును ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఎగుమతులు 17 శాతం అప్.. నాస్కామ్ ప్రకారం.. సమీక్షా కాలంలో ఎగుమతి ఆదాయాలు 17.2 శాతం పెరిగి 178 బిలియన్ డాలర్లకు చేరనుండగా, దేశీయంగా ఆదాయాలు 10 శాతం వృద్ధితో 49 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. కీలక విభాగాల వారీగా చూస్తే.. సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, అనలిటిక్స్‌కు డిమాండ్ నేపథ్యంలో ఐటీ సర్వీసుల ఆదాయం 16.9 శాతం, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వృద్ధి అత్యధికంగా 18.7 శాతం, హార్డ్‌వేర్ అత్యంత తక్కువగా 7.3 శాతంగా నమోదు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి జోరు కొనసాగుతుందని సీఈవోలు ఆశావహంగా ఉన్నట్లు నాస్కామ్ సర్వేలో తేలింది. ఫార్మా/హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, బీమా, తయారీ, రిటైల్/ఈ–కామర్స్ మొదలైన రంగాల కంపెనీల ఐటీ వ్యయాలు ఎక్కువగా ఉండగలవని సీఈవోలు అభిప్రాయపడ్డారు. అలాగే, 2022–23లోనూ రిక్రూట్మెంట్పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. గరిష్ట స్థాయికి అట్రిషన్.. అట్రిషన్ సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి క్రమంగా తగ్గగలదని నాస్కామ్ వైస్ చైర్మన్ కృష్ణన్ రామానుజం తెలిపారు. టాప్ 10 ఐటీ కంపెనీల డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు చూస్తే ఉద్యోగుల వలసలు.. మరీ తగ్గకపోయినప్పటికీ, ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఇది గరిష్ట స్థాయికి చేరి ఉంటుందని, ఇక నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని ఆశాభావం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు. ప్రతిభావంతులు చేజారిపోకుండా చూసుకోవడం ఇటు పరిశ్రమకు అటు దేశానికి ముఖ్యమని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ పేర్కొన్నారు. ఇందుకోసం కంపెనీలు, నాస్కామ్ కూడా పలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇటీవల కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ ఏకంగా 20 శాతం పైగా నమోదైన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న పట్టణాల్లో మైక్రో ఐటీ హబ్‌లు.. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కార్యకలాపాలను చిన్న పట్టణాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘోష్ చెప్పారు. ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కోయంబత్తూర్, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి సెంటర్లలో మైక్రో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని ఆమె వివరించారు. చిన్న పట్టణాలకు ఐటీ మరింతగా విస్తరించాలంటే నిరంతర విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు నిపుణుల లభ్యత, తగినంత ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉండాలని ఘోష్ తెలిపారు. చదవండి: జనవరిలో ఎగుమతుల్లో 25% వృద్ధి -
వైద్యసేవల్లో ఐటీ.. మేటి.. దేశంలోనే నాలుగో స్థానంలో ..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వైద్య రంగంలోనూ ఐటీ సేవలు అగ్రభాగాన నిలుస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో కావాల్సిన సరుకులనే కాదు.. అవసరమైన వైద్య సేవలను పొందే విషయంలోనూ మహానగర సిటీజన్లు ముందుండడం విశేషం. స్మార్ట్ సాంకేతికత వినియోగంలో ముందున్న నగరవాసులు.. వైద్యసేవల రంగంలోనూ ఆధునిక సాంకేతికత వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. రోగుల అవసరాలకు తగినట్లుగా మహానగరం పరిధిలోని పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య పరీక్షల నిర్వహణ సంస్థలు ఆయా సేవలను ఆన్లైన్ ఆధారంగా అందజేస్తుండడం విశేషం. చదవండి: కేంద్రం వద్దంటే నువ్వేం చేస్తున్నట్లు..? ఈ విషయంలో గ్రేటర్‌సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో దేశరాజధాని ఢిల్లీ తొలిస్థానంలో రెండోస్థానంలో ముంబై.. మూడో స్థానంలో బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు తాజా నివేదికలో పేర్కొనడం విశేషం. ప్రధానంగా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నిర్వహణ, టెలీమెడిసిన్ సేవలు, వెబ్ ఆధారిత డయాగ్నొస్టిక్ సేవల్లో సాంకేతికత వినియోగం పెరిగినట్లు ఈ సంస్థ అధ్యయనంలో తెలిపింది. దేశంలో ఇలాంటి సేవలు అందించే 320 సంస్థలుండగా.. గ్రేటర్ పరిధిలో వీటి సంఖ్య 50కిపైమాటేనని నాస్కామ్ అంచనా వేసింది. చదవండి: తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్! ఐటీ.. హై హై.. వైద్యసేవల రంగంలో సేవలందిస్తున్న పలు సంస్థలు కృత్రిమ మేధస్సు (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్ (ఐఓటీ) అనువర్తనాలను వినియోగించడం ద్వారా రోగులకు వివిధ రకాల వైద్య, డయాగ్నొస్టిక్, డాక్టర్ కన్సల్టేషన్ సేవలందిస్తున్నట్లు నాస్కామ్ తెలిపింది. ప్రధానంగా వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులను కలిసేందుకు గ్రేటర్ సిటీజన్లు ఒక్క మౌస్‌క్లిక్‌తో వివిధ ఆన్లైన్ పోర్టళ్లను ఆశ్రయించి.. అందులోనూ వైద్యనిపుణులకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన తర్వాతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాల్హెల్త్ వంటి సంస్థలు రోగుల ఇళ్ల వద్దనే రక్త,మూత్ర,తెమడ నమూనాలను సేకరించి.. ఆన్లైన్లో వైద్యపరీక్షల ఫలితాలను ఇటు వైద్యులకు అటు రోగులకు సకాలంలో చేరవేస్తోందని ఉదాహరించింది. సాంకేతికతపైనే ఆధారం.. పలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొన్నిసార్లు రోగుల నిష్పత్తి ఆధారంగా బెడ్లు సరిపోకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో టెలీమెడిసిన్ సేవలు అవసరమవుతున్నాయి. నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు రోగులు,సిటీజన్లు హెల్త్‌కేర్ ఐటీ పోర్టళ్లు,సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ, నిపుణులైన వైద్యుల కన్సల్టేషన్‌కు ఈ సాంకేతిక ఉపకరిస్తోంది. రోగులు, వినియోగదారులు తమ బడ్జెట్లోనే వివిధ రకాల శస్త్రచికిత్సలు, వైద్యసేవలు ఎలా పొందాలని క్షణాల్లో తెలుసుకునేందుకు పలు మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ పోర్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. హెల్త్‌కేర్ రంగంలో ఐటీ,సాంకేతికత వినియోగం ఆధారంగా సేవలందించే సంస్థల వ్యాపారం దేశవ్యాప్తంగా 2016లో 70 మిలియన్ డాలర్లు కాగా.. 2021 చివరి నాటికి 160 మిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుందని నాస్కామ్ అంచనా వేసింది. రోగులకు సంబంధించిన వివరాలను భద్రపరచడం,వారు కోరిన వైద్య సేవలను సకాలంలో అందించేందుకు హెల్త్‌కేర్ ప్రిడిక్టివ్ ఎనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అనే సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సమర్థవంతమైన సమాచార నిర్వహణ, సమాచార వ్యాప్తికి ఐటీ సాంకేతికత దోహదం చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులతో పాటు, పబ్లిక్ హెల్త్‌కేర్ వ్యవస్థలో రోగుల సంరక్షణకు ఐటీని దత్తత చేసుకోవడం అనివార్యమైందని నాస్కామ్ పేర్కొంది. ఈ ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించుకునే విషయంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు, సంస్థలు వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను సైతం అందజేస్తున్నాయని నాస్కామ్ వివరించింది. -
టెక్ స్టార్టప్‌లలో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
‘హెచ్1’ దెబ్బ అమెరికాకే..!
న్యూఢిల్లీ: టెక్నాలజీ నిపుణులకు వీసాలివ్వటంపై మరిన్ని పరిమితులు విధిస్తే అమెరికన్ కంపెనీలకే ప్రతికూలమవుతుందని దేశీ ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. ఈ వీసాలపై విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికన్ కంపెనీలు సరైన వారు దొరక్క బలహీనంగా మారతాయని, ఉద్యోగాలకు ముప్పు తప్పదని పేర్కొంది. వివాదాస్పద హెచ్–1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కుతుండటం వారి ప్రతిభకు తార్కాణమని, వీటిలో చాలా మటుకు వీసాలను అంతర్జాతీయ, అమెరికన్ బహుళజాతి దిగ్గజాలు స్పాన్సర్ చేస్తున్నాయని నాస్కామ్ తెలియజేసింది. విదేశీ కంపెనీలు డేటాను తమ దేశంలోనే భద్రపర్చాలంటూ ఒత్తిడి చేసే దేశాలకు ఇచ్చే హెచ్–1బీ వీసాలపై 10–15 శాతం మేర పరిమితి విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో నాస్కామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశంపై ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ ఏదీ రాలేదని, అధికారులిచ్చే స్పష్టమైన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని నాస్కామ్ తెలిపింది. ఒకవేళ ఇలాంటిదేమైనా అమలు చేసిన పక్షంలో ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే భారీగా ఆదాయాలు పొందుతున్న 150 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. సాధారణంగా భారతీయ ఐటీ సంస్థలు అత్యధికంగా హెచ్–1బీ వీసాలపైనే తమ ఉద్యోగులను అమెరికాలోని క్లయింట్ లొకేషన్స్‌కు పంపిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో వీసాల పరిశీలన చాలా కఠినతరంగా మారడంతో దేశీ ఐటీ సంస్థలు అమెరికాలోని స్థానికులనే ఎక్కువగా రిక్రూట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ‘ఒకవేళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడాన్ని అమెరికా విధానాలు కఠినతరం చేసిన పక్షంలో దాని వల్ల.. వారిపై ఆధారపడి ఉన్న అమెరికా కంపెనీలే బలహీనపడతాయి. ఆయా సర్వీసులను మళ్లీ విదేశాల నుంచి పొందాల్సి వస్తుంది’ అని నాస్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. పరిమితులపై ఇంకా సమాచారం రాలేదు: కేంద్ర వాణిజ్య శాఖ డేటా లోకలైజేషన్ నిబంధనలు అమలు చేసే దేశాలకిచ్చే హెచ్–1బీ వీసాలపై పరిమితులు విధించే విషయంపై అమెరికా నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చెల్లింపుల సేవలు అందించే పేమెంట్ సర్వీసుల సంస్థలు భారతీయ వినియోగదారుల డేటాను భారత్‌లోనే ఉంచాలంటూ కేంద్రం గతేడాది ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నిబంధనలనే వ్యతిరేకిస్తూ.. తాజాగా హెచ్–1బీ వీసాల విషయంలో భారత్ లాంటి దేశాలను అమెరికా టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. -
ఐటీ-బీపీఎం రంగంలో మహిళల జోరు
బెంగళూరు: ఐటీ-బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) రంగంలో మహిళలు జోరుమీదున్నారు. నాస్కామ్ సర్వే ప్రకారం.. 2012 నుంచి చూస్తే ఉద్యోగార్థుల్లో మహిళల వాటా 5 శాతం పెరుగుదలతో 28 శాతానికి పెరిగింది. వీరు ప్రారంభ స్థాయి నియామకాల్లో 51 శాతం వాటాను ఆక్రమించారు. విశాఖలో నాస్కామ్ వేర్‌హౌస్ ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తన స్టార్టప్ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో వేర్హౌస్ను ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.