దేశంలోనే అతి పెద్దదైన మెడికల్ డివైజ్ ఇండస్ట్రియల్ పార్కు హైదరాబాద్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నగర శివారులోని సుల్తాన్‌పూర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏడు మెడికల్ డివైజ్ ఇండస్ట్రీస్‌ని మంత్రి కేటీఆర్ డిసెంబరు 15న ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల కిందట ఈ పార్కుకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
మెడికల్ హబ్‌గా
ప్రొమియా థెరాప్యూటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆకృతి ఒకులోప్లాస్టీ, అర్కా ఇంజనీర్స్, ఎస్‌వీపీ టెక్నో ఇంజనీర్స్, ఎల్వికాన్ అండ్ డీస్‌మెడిలైఫ్ సంస్థలు తమ ఫ్యా‍్టక్టరీలను నేడు ప్రారంభించనున్నాయి. దీంతో ఫార్మా సెక్టార్‌కే కాకుండా మెడికల్ డివైజెస్‌కి కూడా హైదరాబాద్ హబ్‌గా మారనుంది.
తయారయ్యేవి ఇవే
మెడికల్ రంగానికి సంబంధించి కేర్ డివైజెస్, విట్రో డయాగ్నోస్టిక్ పరికరాలు, అనలైజర్స్, ఒక్యులర్ ఇంప్లాంట్స్, సర్జికల్, డెంటర్ ఇంప్లాంట్స్, డ్రెసింగ్ తదితర మెడికల్ ఉత్పత్తులు ఈ ఫ్యాక్టరీల నుంచి రాబోతున్నాయి.
1300ల మందికి ఉపాధి
ఈ మెడికల్ డివైజ్ పార్కులో ప్రస్తుత పెట్టుబడులు రూ.265 కోట్లకు చేరుకోగా ప్రత్యక్షంగా 1300ల మందికి ఉపాధి లభిస్తుంది. 2030 నాటికి హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ విలువల వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు (మెడికల్ డివైజెస్ పార్క్) సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒకే రోజు ఏడు కంపెనీలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS గారు ప్రారంభించనున్నారు. #TriumphantTelangana pic.twitter.com/cnJhPOZO8L
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 15, 2021
చదవండి:Hyderabad: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ విస్తరణ.. కొత్తగా మరో డెలివరీ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment