
ముంబై: వాతావరణ మార్పులపై పోరుపై యువతలో అవగాహన కల్పించడంతో పాటు హరిత ఉద్యోగాల కల్పన దిశగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్), 1ఎం1బీ జట్టు కట్టాయి. గ్రీన్ జాబ్స్ అండ్ సస్టెయినబిలిటీ యాక్సిలరేటర్ ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పాటించతగిన విధానాలతో 1ఎం1బీ ప్రత్యేక పాఠ్యాంశాలతో ఈ .. ఏడు రోజుల ప్రోగ్రాం రూపొందింది.
ఇందులో ఎంపికయ్యే టాప్ 20 మంది విద్యార్థులకు ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ ఇంటర్న్‌షిప్‌లు అందిస్తుంది. అలాగే అత్యుత్తమ స్టూడెంట్ల బృందానికి ఈ ఏడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యాక్టివేట్ ఇంపాక్ట్ యూత్ సదస్సులో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుందని ఏబీఎఫ్‌ఆర్‌ఎల్, 1ఎం1బీ తెలిపాయి. 2023 జనవరిలో పైలట్ ప్రాతిపదికన నిర్వహించిన ప్రోగ్రాంలో 545 సీబీఎస్‌ఈ పాఠశాలలు ఇందులో పాల్గొన్నాయని, ఏప్రిల్ 20 నుంచి దీన్ని 25,000 పైచిలుకు పాఠశాలలు, కాలేజీలకు విస్తరించనున్నామని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment