
వేతన జీవులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) త్వరలోనే శుభవార్తను అందించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతన పరిమితిని పెంచాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని అడ్-హాక్ కమిటీ సూచించింది. అంతేకాకుండా వేతన పరిమితి పెంపు నిర్ణయాన్ని అడ్ హాక్ కమిటీ సమర్థించింది.
సానూకూలంగా కేంద్రం..!
అడ్ హక్ కమిటీ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. కమిటీ ప్రతిపాదనలపై కేంద్రం కూడా సానూకూలంగా స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల అమలు జరిగితే సుమారు 7.5 మిలియన్ల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలియజేస్తే కంపెనీలు ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగానే ఉన్నట్లు సదరు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి ప్రముఖ మీడియాతో వెల్లడించారు. ఇక వేతన పరిమితి పెంపు చివరిసారిగా 2014లో జరిగింది.
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఏటా రూ. 6750 కోట్లను చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బేసిక్ శాలరీలో 1.16 శాతానికి సబ్‌స్క్రైబర్ పీఎఫ్ అకౌంట్‌కు జమచేస్తుంది. ఈపీఎఫ్‌ఒ , ఈఎస్‌ఐసీ,బెనిఫిట్స్‌తో ఈపీఎఫ్‌వో సభ్యులకు సామాజిక భద్రతను అందిస్తోంది. ఈ రెండు పథకాల నిబంధనలలోని తేడాలతో ఉద్యోగులు సామాజిక భద్రత ప్రయోజనాలను కోల్పోకూడదని కేఈ రఘునాథన్ పేర్కొన్నారు.
చదవండి: ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త...!
Comments
Please login to add a commentAdd a comment