Adani Group Investor Rajiv Jain Profit Nearly 1 Billion USD in Less Than 100 Days - Sakshi
Sakshi News home page

అదానీ గ్రూపు ఇన్వెస్టర్‌ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!

Published Tue, May 23 2023 1:36 PM | Last Updated on Tue, May 23 2023 2:52 PM

 Adani Group investor Rajiv Jain profit nearly 1 billion usd in less than 100 days - Sakshi

సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్డ్‌ ఆరోపణలతో అదానీ గ్రూపు భారీ నష్టాలను మూటగట్టుకుంది. లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ క్యాప్‌ తుడిచుపెట్టుకుపోతోంది. అయితే తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీకి చెందిన 'స్టాక్స్‌ అన్నీ తిరిగి ఫామ్‌లోకి   వచ్చాయి. సంస్థ మార్కెట్‌ క్యాప్‌ కూడా పది లక్షల కోట్లను అధిగమించింది. ఈ క్రమంలో టాప్‌ఇన్వెస్టర్‌ విజయగాథ వైరల్‌గా మారింది.

రాజీవ్ జైన్, భారీ లాభాలు 
జీక్యూజీ పార్ట్‌నర్స్‌  చైర్మన్‌ రాజీవ్ జైన్  అదానీ  నాలుగు కంపెనీలలో పెట్టిన పెట్టుబడులతో కేవలలో 100 రోజుల లోపే  65.18 శాతం రాబడిని పొందారు. విలువ పరంగా మార్చి 2న రూ.15,446.35 కోట్లగా ఉన్న పెట్టుబడులు మంగళవారం నాటి ట్రేడింగ్‌తో కలిపి  ఏకంగా రూ.10,069 కోట్లు పెరిగి రూ.25,515 కోట్లకు చేరింది. మార్చిలో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీక్యూజీ పెట్టుబడి రూ.15,446 కోట్లతో పోలిస్తే ఇది 65 శాతం పెరగడం విశేషం. (ఓలా యూజర్లకు గుడ్‌ న్యూస్‌: సీఈవో ట్వీట్‌ వైరల్‌ )

కేవలం 52 ట్రేడింగ్ సెషన్లలో జీక్యూజీ పార్టనర్స్‌ పెట్టుబడి రూ 25 వేల కోట్లకు పెరిగింది. ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై పెట్టుబడి దారులు ఆశ్చర్య పోనవసరం లేదని, సమర్థుడైన ప్రమోటర్ ద్వారా నిర్వహించిన ఆస్తులని రాజీవ్ జైన్ ప్రకటించారు. కాగా జీక్యూజీ చైర్మన్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్‌ రాజీవ్ జైన్, 2 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ బిలియనీర్స్ 2023 జాబితాలో ప్రవేశించారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్‌ ఫౌండర్‌ ఎంగేజ్‌మెంట్‌)

నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలు 20-75 శాతం మధ్య ర్యాలీ చేశాయి. దీనికి తోడు అదానీ గ్రూపులో అవకతవకలపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం  నియమించిన  ప్యానెల్‌  తేల్చి చెప్పడంతో అదానీ షేర్లలో ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది.  ఫలితంగా సోమవారం నాటికి కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్‌ రూ.10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది.  ఫిబ్రవరి 27నాటి కనిష్ట స్థాయి రూ.6.8 లక్షల కోట్ల నుంచి 50 శాతానికి పైగా రికవరీ. ఫిబ్రవరి 8న మొదటిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కు కంటే దిగువకు పడి పోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికకు ఒకరోజు ముందు  గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.2 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement