![After Silver Lake KKR may invest usd1 billion in Reliance Retail - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/9/kkr.jpg.webp?itok=bKTMN1BE)
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలయనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఇప్పటిదాకా డిజిటల్ విభాగంలో పెట్టుబడుల వరద పారించారు. ఇపుడిక రీటైల్ విభాగంలో పెట్టుబడుల పరంపరను కొనసాగించనున్నారు. డిజిటల్ విభాగం జియోలో పెట్టుబడులు పెట్టిన దిగ్గజాలను రీటైల్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేయాలని ఆహ్వానించిన అంబానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లోఅమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ కోవలో మరో దిగ్గజం సంస్థ కేకేఆర్ చేరింది. సుమారు 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు కేకేఆర్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నట్టు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ నెలలోనే ఒక ప్రకటన రావచ్చు అని పేర్కొంది. అయితే అంచనాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (జియో : 10 కోట్ల లోకాస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు)
కాగా రిలయన్స్ రీటైల్లో సిల్వర్ లేక్ 7500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని బుధవారం రిలయన్స్ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది ఆరంభంలో సిల్వర్ లేక్ 1.35 బిలియన్ల డాలర్లు జియోలో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment