
ఐపీఎల్ ప్రియులకు భారతీ ఎయిర్‌టెల్ శుభవార్త తెలిపింది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్19న తిరిగి ప్రారంభంకాబోతున్న మనకు సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రియుల కోసం భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్లను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్ లను విడుదల చేసింది. దీంతో వినియోగదారులు తమ మొబైల్ ద్వారానే టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. ఈ మూడు కొత్త ప్యాక్(రూ.499, రూ.699, రూ.2798)లను రీఛార్జ్ చేసుకుంటే హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.(చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ రికార్డు)
ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్
రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి.
ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్
రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి.
ఎయిర్ టెల్ రూ.2798 ప్లాన్
రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment