సైన్యం దాని అనుబంధ విభాగాల్లో పనిచేసిన లక్ష మంది మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబీకులకు తమ సంస్థలో స్థానం కల్పించినట్టు ఆన్‌లైన్ వేదిక అమెజాన్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. 2019లో అంతర్జాతీయంగా తాము అమెజాన్ మిలటరీ ప్రోగ్రామ్ ప్రారంభించామని, 2021 నాటికి మూడేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆ లక్ష్యాన్ని సాధించామని వివరించారు.
దీని కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ (డీజీఆర్), ఇండియన్ నావెల్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ (ఐఎన్‌పీఏ), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ (ఐఎఎఫ్‌పీఏ), ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఏడబ్ల్యూపీఓ) లతో కలిసి పనిచేశామని వివరించారు.
ఈ సందర్భంగా తాజాగా ఈ ప్రోగ్రామ్ ద్వారా వర్క్‌ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ (డబ్లు్యహెచ్‌ఎస్) మేనేజర్‌గా ఎంపికైన ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారిణి సుప్రియ మాట్లాడుతూ సైన్యంలో తన అనుభవాలు ఈ హోదాలో రాణించేందుకు ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment