గత కొద్ది నెలల నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో పెరగడంతో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనలను కొనుగోలు చేసే ప్రధాన సమస్య ఛార్జింగ్ సమస్య. పెట్రోల్, డీజిల్ ఫిల్ చేసుకున్నంత వేగంగా ఈవీలను వేగంగా ఛార్జింగ్ చేయాలక పోతున్నాము. త్వరలోనే ఈ కష్టాలకు కూడా చెక్ పడనుంది. ప్రముఖ ఆంప్రియస్ టెక్నాలజీస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనలను కేవలం 6 నిమిషాల్లో 0-80 శాతం చార్జ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 370 kW అవుట్‌పుట్ కలిగి ఉంది.
మొబైల్ పవర్ సొల్యూషన్స్ అనే కంపెనీఅత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యం గల ఛార్జింగ్ టెక్నాలజీని పరీక్షించింది. ఈ పరీక్షలో 80 శాతం ఛార్జింగ్ చేయడానికి 6 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టింది. ఈ కంపెనీ చార్జర్ ద్వారా 0-70% ఛార్జింగ్ చేయడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడితే, ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫుల్ చార్జ్ చేయడానికి 30 నిమిషాల సమయం పట్టింది. ఇంకో ఆసక్తికర విషయం చెప్పాలంటే, 90-100% చార్జ్ కావడానికి 20 నిమిషాల సమయం పట్టింది. ఈ టెక్నాలజీ సిలికాన్ ఆనోడ్ లి-అయాన్ బ్యాటరీ సెల్స్ సహాయంతో పని చేస్తుంది.
(చదవండి: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ధర ఇంత తక్కువ..?)
Comments
Please login to add a commentAdd a comment