Anand Mahindra keeps his promise: టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ఆనంద్ మహీంద్రా. ప్రతిభకు తగ్గ సత్కారం చేయడంలో ఆయనెప్పుడు వెనుకాడరు అనడానికి మరో ఘటన ఉదాహారణగా నిలించింది. టోక్యోలో 2020 ఆగస్టులో జరిగిన పారా ఒలంపిక్స్‌లో అవని లేఖర 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో బంగారు పతాకం సాధించింది. అంతేకాదు 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అవని లేఖరను ప్రశంసిస్తూ ఆమెకు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్త మహీంద్రా వాహనాన్ని బహుమతిగా ఇస్తానంటూ ఆగస్టులో ఆయన ప్రకటించారు.
ఆనంద్ మహీంద్రా నుంచి ఆజ్ఞలు రావడం ఆలస్యం.. వెనువెంటనే పనులు జరిగిపోయాయి. మహీంద్రా గ్రూపు చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ ఆధ్వర్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్‌లో మార్పులు చేశారు. డ్రైవర్ సీటు పక్కన ఉండే కో డ్రైవర్ సీటు బయటకి వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ మార్పు వల్ల దివ్యాంగులు సులభంగా కారులోకి ఎక్కడం, దిగడం చేయవచ్చు. దివ్యాంగులకు ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిన కారును అవని లేఖరకు ఇటీవల అందించారు. తనకు బహుమతిగా వచ్చిన కారుని చూసిన అవని లేఖర మురిసిపోయింది. ధ్యాంక్యూ ఆనంద్ మహీంద్రా అండ్ టీమ్ అంటూ తాను కారులో కూర్చున్న ఫోటోలను ట్వీట్ చేసింది.
🙏🏽🙏🏽🙏🏽 https://t.co/WgHyREpiYo
— anand mahindra (@anandmahindra) January 19, 2022
Comments
Please login to add a commentAdd a comment