సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా సమకాలిన అంశాలపై వేగంగా స్పందిస్తూ ఉంటారు. ప్రతిభను ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను పెంపొందించేలా..కొత్త రకం ఆలోచనలు రేకెత్తించేలా ఆయన స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఈశాన్య భారత దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు.
ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో వాన్‌ఝింగ్ - ఖోంగ్‌ఖాంగ్ పట్టణాలను కలిపే జాతీయ రహదారి 39ను విస్తరించారు. సిక్స్‌లేన్ రోడ్డుగా అభివృద్ధి చేసిన ఈ రహదారి మణిపూర్‌కి భవిష్యత్తులో జీవనాడి కానుంది. ఈ రోడ్డుకు సంబంధించిన ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఈ రోడ్డును చూస్తూ ముచ్చటేస్తోంది. ప్రయాణించేందుకు రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. మ్యాజిక్ ఆఫ్ మణిపూర్‌లా ఉన్న ఇలాంటి రహదారులే మన దేశాన్ని మరింత దగ్గరగా చేసేవి అంటూ ముక్తాయింపు ఇచ్చారు ఆనంద్‌మహీంద్రా,
This looks superb and so inviting. The magic of Manipur is now much more accessible. These highways will knit India together even more tightly. 👏🏽👏🏽👏🏽 https://t.co/5UuXDC8bNW
— anand mahindra (@anandmahindra) March 17, 2022
Comments
Please login to add a commentAdd a comment