కళాకారులకు మరణం ఉంటుందేమో గానీ.. కళ మాత్రం ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. లెజండరీ సింగర్ మహ్మద్ రఫీ ఈ లోకాన్ని వీడి ఎన్నో ఏళ్లు గడిచినా ఆయన అద్భుతమైన గాత్రం నుంచి వెలువడిన పాటలు మాత్రం అభిమానుల మనసుల్ని నేటికీ రంజింపజేస్తూనే ఉన్నాయి. విలక్షణమైన గొంతుతో తనదైన శైలిలో ఆయన ఆలపించిన గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎంతో మంది గొప్ప గొప్ప గాయకులు ఉన్నా రఫీకి వారెవరూ సాటిసారరని, మళ్లీ అలాంటి గొప్ప గాయకుడిని భవిష్యత్తులో చూసే అవకాశం దక్కుతుందో లేదోనని మదనపడుతూ ఉంటారు ఆయనను ఆరాధించేవారు. (అభిమాన నటుడికి బాలుడి అరుదైన నివాళి)
అయితే కోళికోడ్‌కు చెందిన సౌరవ్ కిషన్ అనే 23 ఏళ్ల కుర్రాడు వారి కలను తీర్చే అవకాశం ఉందంటున్నారు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన శనివారం ఓ వీడియోను రీట్వీట్ చేశారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా కొత్త మహ్మద్ రఫీ కోసం మనం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించే సమయం వచ్చినట్లుగా అనిపిస్తోంది... ఈ క్లిప్ స్విచ్ఛాప్ చేయలేకపోతున్నా’’అని రఫీ ఆలపించిన పాటను సౌరవ్ పాడిన తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కేరళకు చెందిన సౌరవ్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నట్లు సమాచారం. అతడికి సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. స్థానికంగా అతడికి చోటా రఫీ అనే పేరు కూడా స్థిరపడిపోయింది.
We have been waiting for decades for a new Mohammed Rafi. It sounds as if we may have to wait no longer... I couldn’t switch this clip off... https://t.co/QhM3koPlVE
— anand mahindra (@anandmahindra) September 12, 2020
Comments
Please login to add a commentAdd a comment