
బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్యం నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా (సీఈఏ) ప్రముఖ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్ అనంత నాగేశ్వరన్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈఏగా కొనసాగుతున్న కే సుబ్రమనియన్ స్థానంలో నాగేశ్వరన్‌ను నియామకం చేపట్టింది.
బడ్జెట్ తయారీ పనుల్లో కేంద్రం నిమగ్నమైంది. గురువారమే బడ్జెట్ తయారీలో పాలు పంచుకునే ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని నార్త్ బ్లాక్‌లో లాక్‌ఇన్‌లోకి గురువారం పంపింది. లాక్‌ఇన్ మొదలైన తర్వాత 24 గంటల్లోపే ప్రస్తుతం ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారుని తప్పించి కొత్త వారిని నియమించడం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నాగేశ్వర్‌ను ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రకటన వెలువడింది. అయితే కొత్త సీఈవో పదవీ బాధ్యతలు వెంటనే తీసుకుని బడ్జెట్ తయారీలో చేయి వేస్తారా ? లేక తర్వాత రంగంలోకి దిగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే సీఈఏగా నాగేశ్వర్ నియామకం పట్ల సోషల్ మీడియాలో సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది.
చదవండి: రహస్యంగా బడ్జెట్ తయారీ.. అజ్ఞాతంలోకి ‘బడ్జెట్’ ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment