Bank Holidays in January 2022: మీరు రాబోయే ఏడాది 2022 జనవరిలో ఏమైనా బ్యాంక్ లావాదేవీల గురుంచి ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ముఖ్య గమనిక. 2022 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ క్యాలండర్ మీ కార్యచరను సిద్దం చేసుకుంటే మంచిది. 2022 జనవరిలో పలు నగరాల్లో పలు తేదీలలో బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. ఈ సెలవు రోజుల్లో సంబంధిత బ్యాంకు బ్రాంచులలో నగదును విత్ డ్రా చేసుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి వీలుండదని పేర్కొంది. వారాంతాలు మినహాయించి జనవరిలో తొమ్మిది రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే, ఇది అన్నీ రాష్ట్రాలకు వర్తించదు.
2022 జనవరిలో బ్యాంకుల సెలవు తేదీలు..
- జనవరి 1, 2022 - కొత్త ఏడాది సందర్భంగా ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌లలో గల బ్యాంకులు మూసివేయనున్నారు.
- జనవరి 3, 2022 - న్యూ ఇయర్, లోసూంగ్ సెలబ్రేషన్స్ కోసం ఐజ్వాల్, గ్యాంగ్‌టక్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
- జనవరి 4, 2022 - లోసూంగ్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో జనవరి 4న కూడా బ్యాంకులు మూతపడతాయి.
- జనవరి 11, 2022 - మిషనరీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
- జనవరి 12, 2022 - స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులు మూసివేయనున్నారు.
- జనవరి 14, 2022 - మకర సంక్రాంతి, పొంగల్ సందర్భంగా అహ్మదాబాద్, చెన్నైలలో బ్యాంకులు మూసివేయనున్నారు.
- జనవరి 15, 2022 - ఉత్తరాయణ పుణ్యాకాల మకర సంక్రాంతి పండుగ, సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.
- జనవరి 18, 2022 - తైపూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు.
- జనవరి 26, 2022 - గణతంత్ర దినోత్సవం సందర్భంగా అగర్తలా, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, శ్రీనగర్ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు.
పైన పేర్కొన్న సెలవు రోజులు మాత్రమే కాకుండా జనవరి 8(2వ శనివారం), జనవరి 22(4వ శనివారం)న బ్యాంకులకు సెలవు. ఇక యధావిదిగా జనవరి 2, 9, 16, 23 30న ఆదివారం కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి.
(చదవండి: Fact Check : విమానం విడిచి రైలులో ప్రయాణించిన విజయ్‌మాల్యా?)
Comments
Please login to add a commentAdd a comment