హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అగ్రగామి హైదరాబాద్ ఆస్పత్రి ఏఐజీలో (ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ) వాటాలు కొనుగోలు చేయడంపై బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా (బీపీఈఏ) దృష్టి పెట్టింది. ఈ రేసులో మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కన్నా బీపీఈఏ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ప్రతిపాదిత డీల్‌లో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టరయిన క్వాడ్రియా క్యాపిటల్ తనకున్న 30 శాతం వాటాలను విక్రయించి, వైదొలగనుంది. బీపీఈఏ మొత్తం మీద 40 శాతం వరకూ వాటాలు తీసుకోవచ్చని సమాచారం. 1986లో ఏర్పాటైన ఏఐజీకి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి సారథ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలిలో 800, సోమాజిగూడలో 300 పడకలతో ఆస్పత్రులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment