న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూళ్లపై చెప్పినట్టుగానే ఏప్రిల్ 1 నుంచి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దీంతో దిగుమతుల రూపంలో ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని దేశీ పరిశ్రమ నిలదొక్కుకోగలదని పరిశ్రమ సంఘం ఎన్‌ఐఎంఎంఏ పేర్కొంది. ఎన్‌ఐఎంఎంఏ, ఇండియా సోలార్ తయారీదారుల సంఘం, అఖిలభారత సోలార్ కంపెనీ సంఘం ప్రతినిధులు గురువారం ఢిల్లీలో మంత్రి సీతారామన్‌ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్‌పై ఎటువంటి సుంకాల్లేకపోవడంతో దేశీయ యూనిట్లు మూతపడే ప్రమాదంలో ఉన్నట్టు తెలిపారు. దీంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అదే సమయంలో మాడ్యూల్, సెల్ లైన్ ప్లాంట్, మెషినరీ దిగుమతులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించాలని సంఘాలు కోరాయి. సమావేశం ఆశావహంగా నడిచిందని, పరిశ్రమ తన పూర్తి సామర్థ్యాల మేరకు ఎదగడానికి విధానపరమైన మద్దతు అవసరమని మంత్రి గుర్తించినట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment