april 1st
-
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు.బ్రిటిష్ పాలన నుంచి వారసత్వంబ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.వ్యవసాయ దేశంభారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.పండుగలుభారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.ప్రాంతీయ నూతన సంవత్సరంభారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు.ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటిష్ పాలన నుంచి వారసత్వం బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. వ్యవసాయ దేశం భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. పండుగలు భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ నూతన సంవత్సరం భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
సోలార్ మాడ్యూళ్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూళ్లపై చెప్పినట్టుగానే ఏప్రిల్ 1 నుంచి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దీంతో దిగుమతుల రూపంలో ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని దేశీ పరిశ్రమ నిలదొక్కుకోగలదని పరిశ్రమ సంఘం ఎన్ఐఎంఎంఏ పేర్కొంది. ఎన్ఐఎంఎంఏ, ఇండియా సోలార్ తయారీదారుల సంఘం, అఖిలభారత సోలార్ కంపెనీ సంఘం ప్రతినిధులు గురువారం ఢిల్లీలో మంత్రి సీతారామన్‌ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్‌పై ఎటువంటి సుంకాల్లేకపోవడంతో దేశీయ యూనిట్లు మూతపడే ప్రమాదంలో ఉన్నట్టు తెలిపారు. దీంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అదే సమయంలో మాడ్యూల్, సెల్ లైన్ ప్లాంట్, మెషినరీ దిగుమతులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించాలని సంఘాలు కోరాయి. సమావేశం ఆశావహంగా నడిచిందని, పరిశ్రమ తన పూర్తి సామర్థ్యాల మేరకు ఎదగడానికి విధానపరమైన మద్దతు అవసరమని మంత్రి గుర్తించినట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. -
ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న మరిన్ని సర్వీసులు
-
ఏప్రిల్ 1 విడుదల
జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పింఛన్లు ఎట్టకేలకు ఏప్రిల్ 1 నుంచి అందనున్నాయి. జనవరిలో జరిగిన జన్మభూమి సభల్లో పింఛన్ల పంపిణీ అంటూ ఊదరగొట్టి చేతికి మంజూరు పత్రాలను అందజేసి మూడునెలల తర్వాత ఉగాది నుంచి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ఎప్పటి లాగే మాట తప్పి ఎట్టకేలకు ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మదనపల్లె: జిల్లాలో గత మూడు నెలలుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పండుటాకులకు ఊరట కలగనుంది. ఈ ఏడాది నూతనంగా పింఛన్ల కోసం 26,907 మంది దరఖాస్తు చేసుకుంటే వాటిలో 23,147 పింఛన్లను మంజూరు చేస్తూ 3,760 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్లు 1,94,722, వితంతువులు 1,47,904, దివ్యాంగులు 50,249, చేనేత కార్మికులు 6,559, కల్లు గీత కార్మికులు 441 మందికి రూ.43,86,53,500 రూపాయలు అందజేస్తున్నారు. వీటికి అదనంగా నూతనంగా ఒకో నియోజకవర్గానికి 2000 పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ల మంజూరుపై పలువురు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉండి పింఛన్లకు నోచుకోనివారు సైతం ఈసారి పింఛన్లు అందుకుంటామని ఎదురు చూసినా నిరాశే ఎదురైంది. ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం ప్రకటన కూడా అదే దారే. జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామన్న హామీ అమలు కాలేదు. ప్రస్తుతం పాత పద్ధతిలోనే కొత్త పింఛన్ల మంజూరు వ్యవహారం కొనసాగుతోంది. సర్వేదే కీలకపాత్ర ప్రజాసాధికారిక సర్వేను ఆధారంగా చేసుకుని పింఛన్ల మంజూరుకు శ్రీ కారం చుట్టారు. ప్రజాసాధికారిక సర్వేలో వివరాల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలు ఉండీ, జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం వచ్చాకే వాటిని ఇచ్చేందుకు ఎంపిక చేశారు. మిగిలిన వాటిని తిరస్కరించారు. -
ఒక్కరోజే 14 సినిమాలు..!
ఏప్రిల్ తొలి వారం నుంచి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఈ వారమే ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఈ శుక్రవారం ఏకంగా 14 సినిమాలు వెండితెర మీద దాడికి రెడీ అవుతున్నాయి. వీటిలో అంచనాలు ఉన్న సినిమాలు ఒకటి రెండే ఉన్నా... రిలీజ్ విషయంలో మాత్రం ఇది ఓ రికార్డే అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సమస్య ఎలా ఉంటుందో చూడాలి. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో అభిమానుల్లో అంచనాలున్న సినిమా రామ్ గోపాల్ వర్మ ఎటాక్. ఏడాది క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడుతూ చివరికి ఏప్రిల్ 1న ఆడియన్స్ ముందుకు వస్తోంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. దీంతో పాటు నారా రోహిత్ నందిత జంటగా తెరకెక్కుతున్న సావిత్రి సినిమా విషయంలో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలతో పాటులో లోబడ్జెట్‌లో తెరకెక్కిన పిడుగు, 7 టు 4, అప్పుడలా ఇప్పుడిలా, ఆమె ఎవరు, భరతన్న, ఓ మల్లి. రహదారి, 24 అవర్స్, ధనాధన్ లాంటి తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు భారీ సంఖ్యలో డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. శర్వానంద్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా రాజాధిరాజా, సెల్వరాఘవన్ భార్య గీతాంజలి రూపొందించిన నన్ను వదిలి నీవు పోలేవులే, ధనుష్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ సినిమాలు కూడా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. మరి ఈ 14 సినిమాల్లో ఎన్ని సినిమాలను, రిలీజ్ అయినట్టుగా ఆడియన్స్ గుర్తిస్తారో చూడాలి. -
ఫూల్స్ డే
ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్డే! ప్రాక్టికల్ జోక్స్‌తో ఫ్రెండ్స్‌ని ఫూల్స్ చేస్తాం. లేదంటే ఎవరో ఒకరి చేతిలో ఫూల్స్ అవుతాం. కానీ చిన్నచిన్న మిస్టేక్స్తో, మన బిహేవియర్‌తో మనల్ని మనమే ఫూల్స్‌ని చేసుకుంటున్న సందర్భాలు సిటీలో నిత్యకృత్యమవుతూనే ఉన్నాయి. ‘మెట్రో సిటిజన్’గా మనమెంత హుందాగా ఉంటున్నాం? మన డిసిప్లేన్ ఎలా ఉందో ఒక్కసారి రివ్యూ చేసుకుంటే.. ..:: కేకే చెత్తకుండీ దాకా వెళ్తాం. చెత్తను కుండీలో కాకుండా బయట పడేస్తాం. చెత్త ఎత్తేవాళ్లకు ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని మరుస్తాం. ట్రాఫిక్ సిగ్నల్ జంప్‌చేస్తే ఎదురుగా వచ్చేవారికి ఇబ్బంది. అయినా పట్టించుకోం. ‘ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు’ అని ఈల వేసుకుంటూ బ్రేక్ వేయకుండా దూసుకెళ్తాం. రూల్స్ బ్రేక్ చేయడమే ట్రెండ్ అనుకుంటాం. నియమాలు పాటించక నగరవాసులు జరిమానాగా ఏటా రూ. కోట్లాది రూపాయలు చెల్లించడమే ఇందుకు నిదర్శనం. రోడ్డు దాటే పిల్లలు, వృద్ధులకోసం... కాసేపు ఆగాలన్న ఆలోచన రాదు. నా దారి రహదారి అనుకుంటూ ముందుకు పోతాం. ‘డోంట్ స్ప్లిట్ హియర్’ అని ఉన్న దగ్గరే ఉమ్మి వస్తుంది. రాసి ఉన్నది చదివి మరీ ఉమ్మేస్తాం. బస్సులోనో, ఇతర వెహికిల్స్లోనో వెళ్తూ పక్కన ఉన్నవారిని పట్టించుకోం. అంతేనా... గవర్నమెంట్ ఆఫీసులు, ఆస్పత్రుల పరిస్థితి చెప్పక్కర్లేదు. స్టెప్స్ ఎక్కే దగ్గర మూలల్లో ఎర్రని రంగేస్తాం. ఇక పార్కుల పరిస్థితి మరీ అధ్వాన్నం. ‘యూజ్మీ’ అంటూ డస్ట్‌బిన్ నోరెళ్లబెట్టి చూస్తున్నా... మన చేతిలోని చెత్తమాత్రం లాన్‌లోనే పడుతుంది!. స్కూల్, హాస్పిటల్ జోన్లలో హారన్ కొట్టకూడదన్న నిబంధన ఉంది. అయినా ధిక్కరిస్తాం. మనం ఉల్లంఘనులమని ఘంటా బజాయించి మరీ చాటుతాం! ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ‘బ్రాండ్ హైదరాబాద్’ను క్రియేట్ చేసే దిశగా పయనిస్తున్న మనం.. కనీసం స్ట్రీట్స్‌ను నీట్‌గా ఉంచుకోలేకపోతున్నాం. తెలిసీ.. తెలియక చేస్తున్న పొరపాట్లు మనల్ని చిన్నబుచ్చుతాయి. ఈ ఫూల్స్డే నుంచైనా ఇటువంటి వాటికి గుడ్‌బై చెబుదాం! -
ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాలలో ఎంట్రీ ట్యాక్స్
హైదరాబాద్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాలకు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రవాణా, సరుకుల వాహనాలపై విధిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇదివరకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ సమక్షంలో మార్చి 31వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లో రవాణా, సరుకుల వాహనాలపై పన్ను విధించకుండా ఉండాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. గడువు ముగియడంతో రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు ప్రయత్నించగా వీలుపడలేదని సమాచారం. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణా మంత్రి మహేందర్‌రెడ్డిలు ఓ దఫా సమావేశమై ఈ సమస్యపై చర్చించారు. ఇదే సమయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చర్చలు జరిపేందుకు విముఖత చూపారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ఎంట్రీ ట్యాక్స్ విధించడానికి వీల్లేదన్న ఏపీ వాదనలు తెలంగాణ పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. ఈ ఎంట్రీ పన్నుతో ఆంధ్ర కంటే తెలంగాణకు మూడు నెలలకు అదనంగా రూ.30 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రవాణా రంగంలో ఏపీది 60 శాతం వాటాగా ఉండటమే ఇందుకు కారణం. ఇందులో ముఖ్యంగా స్టేజి క్యారియర్లుగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సులపై పన్ను భారం పడనుంది. దీంతో ప్రైవేటు బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రైవేటు ఆపరేటర్లు ఏప్రిల్ 1తర్వాత బుక్ చేసుకునే టిక్కెట్లపై ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఆర్టీసీ విభజన జరగనందున ట్యాక్స్ వసూలు చేసే వెసులుబాటు లేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుంచి గ్రానైట్ లారీలు అనునిత్యం కాకినాడ పోర్టుకు వెళతాయి. నల్గొండ నుంచి సిమెంటు, ఇతర ప్రాంతాల నుండి సరుకుల వాహనాలు ఏపీకి వస్తాయని, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ఎంట్రీ ట్యాక్స్ విధించక తప్పదని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ట్యాక్స్ విధించడం వల్ల మూడు నెలలకు చెల్లించే క్వార్టర్లీ పన్ను కొంత వరకు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ ఎంట్రీ ట్యాక్స్ వసూలుపై ఏపీ రవాణా శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నత స్థాయిలో తీసుకునే ఈ నిర్ణయంపై తాము మాట్లాడబోమని నిరాకరించడం గమనార్హం.