హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మరో 235 నగరాలు, పట్టణాలకు 5జీ సేవలను పరిచయం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ 5జీ సర్వీసులు విస్తరించిన కేంద్రాల సంఖ్య 500లకు చేరింది. ప్రతి రోజు 30–40 కేంద్రాల్లో తదుపరి తరం టెలికం సేవలను జోడిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
2023 సెప్టెంబర్‌లోగా అన్ని నగరాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్‌టెల్ సీటీవో రన్‌దీప్ సెఖన్ తెలిపారు. రిలయన్స్ జియో 406 నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందిస్తోంది. 5జీ నెట్‌వర్క్ విషయంలో ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. 2023 మార్చి 31 నాటికి 200 కేంద్రాల్లో 5జీని పరిచయం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అంచనాలను మించి ప్రస్తుతం ఈ సేవలు విస్తరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment