Randeep
-
500 కేంద్రాల్లో ఎయిర్టెల్ 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరో 235 నగరాలు, పట్టణాలకు 5జీ సేవలను పరిచయం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ 5జీ సర్వీసులు విస్తరించిన కేంద్రాల సంఖ్య 500లకు చేరింది. ప్రతి రోజు 30–40 కేంద్రాల్లో తదుపరి తరం టెలికం సేవలను జోడిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2023 సెప్టెంబర్‌లోగా అన్ని నగరాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్టెల్ సీటీవో రన్‌దీప్ సెఖన్ తెలిపారు. రిలయన్స్ జియో 406 నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందిస్తోంది. 5జీ నెట్వర్క్ విషయంలో ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. 2023 మార్చి 31 నాటికి 200 కేంద్రాల్లో 5జీని పరిచయం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అంచనాలను మించి ప్రస్తుతం ఈ సేవలు విస్తరించడం గమనార్హం. -
కర్ణాటకలో ఏడు ఏవై.4.2 కరోనా కేసులు
బెంగుళూరు: కరోనాలో కొత్త రకం ఏవై.4.2 కేసుల సంఖ్య కర్ణాటకలో ఏడుకి చేరుకుంది. డెల్టా ప్లస్ నుంచి రూపాంతరం చెంది కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం కేసులు మొట్టమొదటి సారిగా యూకేలో వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇప్పటిదాకా ఏడు కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ రణ్‌దీప్ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో ఎలాంటి మరణాలు సంభవించలేదని, కొంతమంది ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. -
ఏడాది తర్వాతే... బూస్టర్ డోసులు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసు (ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులకు అదనంగా మరో డోసు) వచ్చే సంవత్సరం అవసరం పడొచ్చని ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులు ప్రజలను మరణాల నుంచి, ఆసుపత్రి పాలయ్యే అవకాశాల నుంచి ఎంతకాలం కాపాడుతున్నాయనే దాన్ని బట్టి బూస్టర్ డోసు ఎప్పుడివ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి శరీరంలో యాంటీబాడీల ఉనికికి కొలమానంగా తీసుకోబోమని తెలిపారు. చిన్న పిల్లలకు త్వరలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ గులేరియా శనివారం ఎన్డీటీవీ ఛానల్‌తో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్, యూకే, యూరోపియన్ యూపియన్, యూఏఈ తదితర దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులను సిఫారసు చేసిన అంశాన్ని ప్రస్తావించగా... ‘బూస్టర్ డోసు ఎప్పుడివ్వాలనే దానిపై నిర్దిష్ట సమాధానం మన వద్ద లేదు. కరోనాపై పోరాడే యాంటీబాడీలు తగ్గుతున్నాయని చెప్పి బూస్టర్ డోసు ఇవ్వలేం. సమయాన్ని బట్టి నిర్ణయించాలి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి రెండో డోసు తీసుకొని ఎంతకాలమైందనేది చూడాలి. మామూలుగా ఏడాది తర్వాత బూస్టర్ డోసుపై ఆలోచించొచ్చు’ అని అన్నారు. ‘యూకేలో గత ఏడాది డిసెంబర్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పుడక్కడ కొత్త కేసులు పెరుగుతున్నాయి కానీ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల్లో పెరుగుదల లేదు. దీనిబట్టి అర్థమవుతోంది ఏమిటంటే 2020 డిసెంబర్లో తీసుకున్న టీకాలు ఇంకా పనిచేస్తున్నట్లే. టీకా రక్షణ దీర్ఘకాలికంగా ఉంటోంది. వైరస్ రూ పాంతరం చెంది బలపడితే కొంచెం వెనకాముందు బూస్టర్ డోసులివ్వాల్సి రావొచ్చు’ అని చెప్పారు. -
సెప్టెంబర్‌కల్లా పిల్లలకు వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: భారత్‌లో పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఈ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అదే జరిగితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదో ముఖ్య ఘట్టంగా మారుతుందని అన్నారు. జైడస్ క్యాడిలా కంపెనీ జైకోవ్–డీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తి చేసి డేటా కూడా సమర్పించిందని, అత్యవసర అనుమతి కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ (2–18 ఏళ్ల లోపు పిల్లలకు) ఆగస్టు లేదంటే సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతాయని, అదే సమయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌కు సెప్టెంబర్ నాటికి వస్తే వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టవచ్చునని గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వివిధ వార్తా సంస్థలకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటివరకు 42 కోట్లకు పైగా టీకా డోసుల్ని ఇచ్చారు. ఇంచుమించుగా 6% జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై ఇన్నాళ్లయినా 18 ఏళ్ల లోపు వారికి మాత్రం టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. పశ్చిమ దేశాల్లో పిల్లలకి ఫైజర్ టీకా ఇప్పటికే ఇవ్వడం మొదలుపెట్టగా... మోడర్నా వ్యాక్సిన్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా 18 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో చురుగ్గా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి పిల్లల కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లే అందుబాటులోకి వస్తాయని గులేరియా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి 18–30 శాతం పెరగడానికి 11–17 ఏళ్ల వయసు వారే కారణమని, వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని ఇటీవల లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో తేలింది. భారత్‌లో పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైతే వైరస్ వ్యాప్తికి గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. బూస్టర్ డోస్ అవసరమే కరోనా వైరస్‌లో తరచూ జన్యుపరంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో భవిష్యత్‌లో బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని గులేరియా చెప్పారు. కరోనా వ్యాక్సిన్లు ప్రభావం తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తే సెకండ్ జనరేషన్ కోవిడ్–19 వ్యాక్సిన్ల (బూస్టర్ డోసులు) అవసరం వస్తుందని అన్నారు. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరి నాటికి బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని, అందుకే అప్పటికల్లా జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని గులేరియా చెప్పారు. -
మూడో వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే..
న్యూఢిల్లీ: మనుషుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం, మరింత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వేరియంట్ పుట్టుకురావడం, లాక్డౌన్ నిబంధనల్లో విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వడం వంటి కారణాలు మూడో వేవ్ ముప్పునకు కారణమయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి చర్యలతో కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు. మూడో వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే ఉందన్నారు. తదుపరి కరోనా వేవ్ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగినట్లు పేర్కొన్నారు. అన్ని ఆంక్షలను ఎత్తివేస్తే, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే కరోనా వేరియంట్ తప్పించుకోగలిగితే రెండో వేవ్ కంటే మూడో వేవ్ ఉధృతి అధికంగా ఉంటుందని వెల్లడించారు. కొన్ని ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కరోనా మహమ్మారి సైతం నియంత్రణలోనే ఉంటుందని, పాజిటివ్ కేసులు పెరగవని రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. మరికొన్ని ఆంక్షలు, నిబంధనలను అమల్లోకి తీసుకొస్తే కేసుల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కరోనాలో కొత్త వేరియంట్లు పురుడుపోసుకున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్ రాకపోవచ్చు..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ వస్తుందని జరుగుతున్న పెద్ద ఎత్తున ఊహాగానాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండి, కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. వీటితో పాటు దేశంలో ఎక్కువమంది ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగినప్పుడు మూడో వేవ్ కరోనా మహమ్మారి ఉండకపోవచ్చనన్నారు. గురువారం ఢిల్లీలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో ప్రజలు ఏమేరకు జాగ్రత్తగా ఉంటారన్న విషయంపైనే మూడో వేవ్ సంక్రమణ ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఒకవేళ వచ్చినా అది బలహీనంగా ఉండవచ్చని గులేరియా అభిప్రాయపడ్డారు. అంతేగాక వ్యాక్సిన్ డోస్ మిక్సింగ్‌పై ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరింత డేటా అవసరమని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయని అన్నారు. అయితే ఇది ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నప్పటికీ, సాధారణం కంటే ఎక్కువ దుష్ప్రభావాలు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ డోస్ మిక్సింగ్ అనేది ప్రయత్నించవలసిన విధానం అని చెప్పడానికి తమకు మరింత డేటా అవసరమని, ఇంకా పరిశోధనలు జరగాలని డాక్టర్ గులేరియా వెల్లడించారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసులపై ఆయన.. కరోనా పాజిటివిటీ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్ సంక్రమణ మరింత ఎక్కువ కాకుండా ఉండేందుకు మరింత దూకుడు విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చదవండి: వైద్యులకు సెల్యూట్: ప్రధాని మోదీ -
Black Fungus: బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్ అనే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారికి ఈ ఫంగస్ సోకుతుండటం ప్రస్తుత సెకండ్ వేవ్‌లోనే కనిపిస్తోందన్నారు. మ్యుకోర్‌మైకోసిన్(బ్లాక్ ఫంగస్) బారినపడే వారిలో 90 శాతం మంది డయాబెటిస్ బాధితులే ఉంటున్నారన్నారు. వీరి రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలిస్తూ నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించారు. శనివారం జరిగిన క్లినికల్ ఎక్స్‌లెన్స్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో ఈ మేరకు రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులను డాక్టర్ గులేరియా అప్రమత్తం చేశారు. డయాబెటిస్ పేషెంట్లు, స్టెరాయిడ్లు తీసుకునే వారే ఎక్కువగా మ్యుకోర్‌మైకోసిన్ బారిన పడుతున్నట్లు ప్రస్తుతం పెరుగుతున్న కేసులను బట్టి తెలుస్తోందన్నారు. స్టెరాయిడ్ల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి దారి తీస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 500కు పైగా మ్యుకోర్‌మైకోసిన్ కేసులను గుర్తించినట్లు అక్కడి వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు. కోవిడ్ పేషెంట్ల చికిత్సలో వాడుతున్న టోసిలిజుమాబ్ అనే ఔషధం ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుందా అనే విషయాన్ని గుజరాత్ వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపారు. కోవిడ్‌బారిన పడిన తర్వాత కూడా డయాబెటిస్ పేషెంట్లు తమకు సూచించిన మందులు వాడకం కొనసాగించాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ శనివారం తెలిపారు. -
అదొక్కటే మార్గం కాదు: ఎయిమ్స్ డైరెక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. కరోనా కేసులు తగ్గేందుకు లాక్‌డౌనే ఉత్తమ మార్గమని, అయితే అదొక్కటే మార్గం కాదని పునరుద్ఘాటించారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో గులేరియా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి మూడు మార్గాలు ఆయన సూచించారు. ఒకటి: ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలి. రెండోది: ఉప్పెనలా దూసుకురాబోతున్న మూడో వేవ్ కట్టడికి వ్యాక్సిన్లు వేయడం పెంచాలి. మూడోది: ప్రజల మధ్య దూరం పెంచాలి. ఒకచోట ఉండకుండా చూసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ‘ప్రజల ఆరోగ్య దృష్ట్యా పాలకులు లాక్డౌన్లాంటి చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలకే లాక్డౌన్ పరిమితమైతే అమెరికా మాదిరి మన దేశంలో పరిస్థితి ఉంటుంది. లాక్డౌన్ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలి. నిర్ణీత కాలం పాటు లాక్డౌన్ విధించాలి. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం జగన్ చదవండి: నోటీస్ ఇవ్వకుండా రాజ్‌భవన్‌పై కూడా విచారించొచ్చు -
ఒక్కరి ద్వారా 406 మందికి కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు కరోనా నిబంధనలు, భౌతిక దూరం వంటివి పాటించపోతే కేవలం 30 రోజుల వ్యవధిలో 406 మందికి కరోనా వైరస్ సోకే అవకాశం పరిశోధనలో తేలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే భౌతిక దూరం, కోవిడ్ నిబందనలు 50 శాతం మేర పాటిస్తే 406కు బదులుగా 15 మందికి మాత్రమే సోకుతుందని, ఇక 75 శాతం మేర పాటిస్తే ముగ్గురికి మాత్రమే సోకుతుందని కేంద్రం పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్ధం చేసుకోని కరోనా నియంత్రణకు తమకు సహకరించాలని కేంద్రం కోరింది. కరోనా నియంత్రణకు భౌతిక దూరమే ముఖ్యమని, మాస్కులు, శానిటైజర్లు వైరస్ వ్యాప్తి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. దయచేసి అత్యవసర విషయానికి తప్ప బయటకు వెళ్లవద్దని, ఇతరులను ఇండ్లకు ఆహ్వానించవద్దని ఆయన పాల్ సూచించారు. ఆసుపత్రి పడకల విషయంలో భయాందోళనలకు గురికావొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వైద్యులు సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని కోరారు. "సాధ్యమైనంత మేర కేసుల సంఖ్యను తగ్గించి, ఆసుపత్రి వనరులను తగిన విదంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్‌ను తగిన విదంగా ఉపయోగించడం చాలా ముఖ్యం"అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. చదవండి: ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందే -
కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూడకతప్పదా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం దేశంలో సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని కరోనా వైరస్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత మార్కెట్లలో సులభంగా లభించడానికి ఆ తర్వాత ఏడాదికిపైగా పడుతుందన్నారు. వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ అంతరించిపోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. మనదేశంలో జనాభా చాలా ఎక్కువని గుర్తు చేశారు. మార్కెట్ నుంచి వ్యాక్సిన్ ఎలా కొనుగోలు చేయొచ్చో చూడడానికి తమకు సమయం కావాలన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని దేశమంతటా మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా పంపిణీ చేయడం అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. కోల్డ్ చైన్‌ను నిర్వహించడం, తగినన్ని సిరంజిలు, సూదులు కలిగి ఉండటం కూడా ఇందులో ఎదురయ్యే ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. చదవండి: మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్ -
సల్మాన్ ఫ్యాన్స్‌కు నిరాశ!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు కొంత నిరాశ కలగనుంది. ఆయన రణదీప్ హుడా కోసం పాట పాడటం లేదని తెలిసింది. సుల్తాన్ సినిమా షూటింగ్ తో బిజిబిజీగా ఉన్న సల్మాన్... గతంలో మేహూ హీరో తేరా, హ్యాంగోవర్ వంటి పాటలు పాడి అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రణదీప్ హూడా కోసం ఓ పాటను పాడిద్దామనుకున్నారు. అదే విషయాన్ని గతంలో రణదీప్ వెల్లడించాడు కూడ. సయ్యద్ అహ్మద్ అఫ్జల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాల్ రంగ్' సినిమా కోసమే సల్మాన్ తో పాట పాడించాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు రావడం, మరోపక్క, సుల్తాన్ చిత్రంతో సల్మాన్ ఖాన్ బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి సల్మాన్ పాట పాడలేకపోవచ్చని, తదుపరి చిత్రం కోసం పాడించే ప్రయత్నం చేస్తామని రణ్ దీప్ స్వయంగా చెప్పారు. అక్షయ్ ఓబ్రాయ్, పియా బాజ్ పేయ్ ప్రముఖ తారాగణంగా రూపొందుతున్న లాల్ రంగ్ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమౌతోంది.