న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం దేశంలో సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని కరోనా వైరస్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత మార్కెట్లలో సులభంగా లభించడానికి ఆ తర్వాత ఏడాదికిపైగా పడుతుందన్నారు. వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ అంతరించిపోదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన తాజాగా ఒక న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. మనదేశంలో జనాభా చాలా ఎక్కువని గుర్తు చేశారు. మార్కెట్ నుంచి వ్యాక్సిన్ ఎలా కొనుగోలు చేయొచ్చో చూడడానికి తమకు సమయం కావాలన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని దేశమంతటా మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా పంపిణీ చేయడం అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. కోల్డ్ చైన్‌ను నిర్వహించడం, తగినన్ని సిరంజిలు, సూదులు కలిగి ఉండటం కూడా ఇందులో ఎదురయ్యే ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు.
చదవండి: మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్
Comments
Please login to add a commentAdd a comment