అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్‌మిషన్ బిజినెస్ చీఫ్‌గా ఉన్నారు. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం ఈ నిర్ణయాన్ని ఏఈఎస్‌ఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సంబంధించిన థర్మల్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును బిమల్ దయాల్ పర్యవేక్షిస్తారని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది .
అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని సంవత్సరానికి 15 శాతానికిపైగా పెంచాలన్న సంకల్పాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నియామకం ద్వారా మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు కంపెనీ తెలిపింది.\
దేశంలో అతిపెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాబోయే 10 సంవత్సరాల్లో రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని పోర్ట్‌ఫోలియో ఇటీవల ప్రణాళికను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది.
బిమల్ పటేల్ నియామకం నేపథ్యంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ బృందంలోని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా, కంపెనీ అన్ని విభాగాలను చూసుకునే కందర్ప్ పటేల్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటర్ విభాగాలను నడిపిస్తారని పీటీఐ కథనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment