Infrastructure Company
-
Bimal Dayal: అదానీ కంపెనీకి కొత్త సీఈవో
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్మిషన్ బిజినెస్ చీఫ్‌గా ఉన్నారు. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం ఈ నిర్ణయాన్ని ఏఈఎస్ఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సంబంధించిన థర్మల్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును బిమల్ దయాల్ పర్యవేక్షిస్తారని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది . అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని సంవత్సరానికి 15 శాతానికిపైగా పెంచాలన్న సంకల్పాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నియామకం ద్వారా మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు కంపెనీ తెలిపింది.\ దేశంలో అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాబోయే 10 సంవత్సరాల్లో రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని పోర్ట్‌ఫోలియో ఇటీవల ప్రణాళికను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. బిమల్ పటేల్ నియామకం నేపథ్యంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రస్తుత మేనేజ్మెంట్ బృందంలోని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా, కంపెనీ అన్ని విభాగాలను చూసుకునే కందర్ప్ పటేల్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటర్ విభాగాలను నడిపిస్తారని పీటీఐ కథనం పేర్కొంది. -
కోవిడ్-19లోనూ ఈ కంపెనీల జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించినప్పటికీ మౌలిక సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్‌కాన్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవుల అమలు కారణంగా పనితీరు నిరాశపరచినప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ జులై 1 నుంచీ ర్యాలీ బాటలో సాగుతున్న టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేరు తాజాగా 4 శాతం జంప్‌చేసి రూ. 538 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 543 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఆరు వారాల్లో ఈ షేరు 41 శాతం ర్యాలీ చేయడం విశేషం. తద్వారా తాజాగా ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికోను మార్కెట్ విలువలో వెనక్కి నెట్టింది. టాటా కన్జూమర్ మార్కెట్ విలువ తాజాగా రూ. 49,427 కోట్లను తాకగా.. మారికో మార్కెట్ క్యాప్ రూ. 47,253 కోట్లుగా నమోదైంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ నికర లాభం 82 శాతం జంప్‌చేసి రూ. 345 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 13 శాతం పుంజుకుని రూ. 2714 కోట్లకు చేరింది. అశోకా బిల్డ్‌కాన్ స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అశోకా బిల్డ్‌కాన్ రూ. 69 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 7 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇదే కాలంలో రూ. 38 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 761 కోట్లకు చేరింది. అయితే ప్రస్తుత ఆర్డర్‌బుక్ విలువ రూ. 8,617 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. కోవిడ్-19 కారణంగా క్యూ1లో కార్యకలాపాలు కుంటుపడినప్పటికీ ఇకపై మెరుగైన పనితీరు చూపగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అశోకా బిల్డ్‌కాన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం దూసుకెళ్లి రూ. 65 వద్ద ట్రేడవుతోంది. -
లోయెస్ట్ బిడ్డర్... జీఎంఆర్–మెగావైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రా, మనీలాకు చెందిన మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ల సంయుక్త భాగస్వామ్య సంస్థ... ఫిలిప్పైన్స్‌లోని విమానాశ్రయ ప్రాజెక్టుకు తక్కువ కోట్ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. క్లార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణానికి ఫైనాన్షియల్ బిడ్ దాఖలుకు 5 కంపెనీలు ఎంపిక కాగా.. వీటిలో ఇదొకటి. కాంట్రాక్టు దక్కించుకునే విషయంలో బాగా పోటీ ఉందని బేసెస్ కన్వర్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ జేక్ బిన్కాంగ్ తెలిపారు. మెగావైడ్–జీఎంఆర్ జేవీ ఆఫర్‌ను పరిశీలిస్తామని చెప్పారు. డిసెంబరు 18న ఎంపికైన కంపెనీని ప్రకటిస్తారు. డిసెంబరు 20న కొత్త టెర్మినల్‌కు శంకుస్థాపన చేసే అవకాశముంది. ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుకు టెండర్లను 2018లో పిలుస్తారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1,614 కోట్లు. 2020 నాటికి విస్తరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా 40 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉంది. దీనిని 1.2 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుస్తారు. ఇప్పటికే జీఎంఆర్ ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రాజెక్టును మెగావైడ్తో కలిసి చేపట్టింది. -
ఎన్సీసీలో బ్లాక్‌స్టోన్ 3% వాటాల విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్లాక్‌స్టోన్ జీపీవీ క్యాపిటల్ పార్ట్నర్స్ (మారిషస్) సంస్థ ఇన్ఫ్రా కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్‌లో 3.25 శాతం వాటాలను విక్రయించింది. 2015 ఏప్రిల్ 10 నుంచి 2016 ఆగస్టు 24 మధ్య కాలంలో ఓపెన్ మార్కెట్ లావాదేవీ రూపంలో 1.80 కోట్ల షేర్ల విక్రయం జరిగినట్లు ఎన్సీసీ తెలిపింది. షేర్ల విక్రయానంతరం ఎన్సీసీలో బ్లాక్‌స్టోన్ వాటా 10.24 శాతం నుంచి 6.99 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్సీసీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 1,930 కోట్లుగాను లాభం 26 శాతం పెరిగి రూ. 52 కోట్లుగాను నమోదైంది. కంపెనీ షేరు గురువారం బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 83.95 వద్ద ముగిసింది. -
బరితెగింపు ఆపై బెదిరింపు
♦ స్టీల్‌ప్లాంట్ భూమిపై పెద్దల కన్ను ♦ రూ.70 కోట్ల భూమి కబ్జాకు పన్నాగం ♦ ఓ ఎమ్మెల్యే సన్నిహితుల భూబాగోతం ♦ తప్పుడు పత్రాలతో హడావుడి.. వెంటనే పునాది పనులు ♦ అడ్డుకున్న ప్లాంట్ అధికారులతో వాగ్వాదం ♦ ఎమ్మెల్యే పేరుతో ఫోనులో హెచ్చరికలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆ భూమిలో ఓ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు శనివారం నిర్మాణ పనులు చేపట్టారు.. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు గానీ.. ఆ తర్వాత జరిగిన తతంగం వింటే.. ఇదెక్కడి విడ్డూరం.. మరీ ఇంత బరితెగింపా.. అని విస్మయం చెందకమానరు!.. అసలు విషయమేంటంటే.. ఆ భూమి స్టీల్‌ప్లాంట్‌కు చెందినది. తప్పుడు పత్రాలతో దాన్ని ఖాతాలో జమ చేసేసుకోవాలన్న యావతో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ అధికారులుకొద్దిసేపటికే అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలు చూపి దబాయించారు.. వాగ్వాదానికి దిగారు.. చివరికి తమ బాస్ పీఏ చేత ఫోను కూడా చేయించారు..అయినా ప్లాంట్ అధికారులు లొంగకపోవడంతో ప్రస్తుతానికి వారి కబ్జాకాండకు బ్రేక్ పడింది. ఇంతకీ తెర వెనుక ఉన్న ఆ బాస్ ఎవరంటారా?..ప్రజాప్రతినిధి అయిన ఓ ఎమ్మెల్యే!! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో విచ్చలవీడి భూకబ్జాల దందాలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. తన తోటివారు చాలామంది కబ్జాలు చేసేస్తుంటే నేనెందుకు మడికట్టుకు కూర్చోవాలని అనుకున్నారో.. ఏమో.. రంగంలోకి దిగారా. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న రీతిలో ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూములపై కన్నేశారు. ఎమ్మెల్యే అండతో ఆయన సన్నిహితులు స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సుమారు ఏడు ఎకరాల భూమిలో పాగా వేసేందుకు తెగించారు. తప్పుడు పత్రాలతో హడావుడి చేశారు. అంతేకాదు కబ్జాదారులకు అనుకూలంగా కొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. కబ్జాకు రాజముద్ర వేయించడానికి రాజకీయ పైరవీలు చేస్తున్నారు. రూ.70 కోట్ల భూమిపై పడ్డారు అగనంపూడి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నంబర్లు 226, 227లలో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఏడు ఎకరాలు ఉన్నాయి. భూసేకరణ చట్టం కింద గతంలో స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన వాటిలో మిగులు భూములు ఇవి. చాలా ఏళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర సుమారు రూ.10కోట్లు. ఆ లెక్కన ఆ భూముల విలువ రూ.70 కోట్లు. అంతటి విలువైన భూమి ఖాళీగా ఉండటం కంటే తాము కబ్జా చేసేయడమే మేలని భావించారు.. నగరానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుల బృందం. ఓ ‘ఇన్ఫ్రా’ కంపెనీని నిర్వహిస్తున్న ఆ ఎమ్మెల్యే సన్నిహితుడు వెంటనే రంగంలోకి దిగారు. ఆ భూమి తమదని చెబుతూ కొన్ని పత్రాలను సృష్టించారు. వాటిని పట్టుకొని కబ్జాకాండకు తెరలేపారు. మొదట ఎకరాన్నర భూమిలో నిర్మాణ పనులు చేపట్టారు. పునాది పనులు కూడా ప్రారంభించారు. అనంతరం మిగిలిన ఐదున్నర ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలన్నది ఆయన ఉద్దేశం. స్టీల్‌ప్లాంట్ అధికారులతో వాగ్వాదం అవి స్టీల్‌ప్లాంట్ భూములని స్థానికులకు తెలుసు. దాంతో నిర్మాణ పనుల సమాచారాన్ని స్టీల్‌ప్లాంట్ అధికారులకు తెలిపారు. దాంతో స్టీల్‌ప్లాంట్ ల్యాండ్, ఎస్టేట్ విభాగం మేనేజర్ పి.ఎల్.రాముడు, సూరి అప్పారావులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకున్నారు. కానీ ఎమ్మెల్యే సన్నిహితులు స్టీల్‌ప్లాంట్ అధికారులపై తిరగబడ్డారు. తమ వద్ద ఉన్న పత్రాలు చూపిస్తూ ఆ భూమి తమదేనని అడ్డంగా వాదించారు. అవి ఫోర్జరీ పత్రాలని అధికారులు తేల్చిచెప్పారు. అంతలోనే స్టీల్‌ప్లాంట్ అధికారులకు ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేశారు. ‘ఎమ్మెల్యేగారు అసెంబ్లీలో ఉన్నారు. భూమి వ్యవహారం ఆయనే స్వయంగా చూస్తున్నారు. ఆ భూమి ఎమ్మెల్యేగారి మనుషులదే. మీరు అక్కడి నుంచి వెళ్లిపోండి. ఎమ్మెల్యేగారు సిటీకి వచ్చిన తరువాత మీతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీనిపై అధికారులు మండిపడ్డారు. ఆ భూమి స్టీల్ప్లాంటుదని స్పష్టం చేశారు. ‘ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతానంటే మాకేం అభ్యంతరం లేదు.. కానీ ప్రస్తుతం ప్లాంట్ భూమిలో పనులను మాత్రం సాగనివ్వబోమని’ స్పష్టం చేశారు. దీనిపె కబ్జాదారులు, అధికారుల మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం సాగింది. చివరికి అధికారులు కబ్జాదారులు తెచ్చిన పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఎమ్మెల్యే వచ్చాక.. మీ సంగతి చూస్తామని’ ఆయన సన్నిహితులు అధికారులను హెచ్చరించడం గమనార్హం. కబ్జాదారుల కోసం... కబ్జాదారులకు అనుకూలంగా ఎమ్మెల్యే సన్నిహితులతోపాటు మరికొందరు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. స్టీల్‌ప్లాంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్‌ను విడిపించడానికి పైరవీలు చేస్తున్నారు. అంతేకాదు రాత్రికి రాత్రి ఆ భూమిలో షెడ్లు నిర్మించడానికి సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా న్యాయపరమైన వివాదాలు సృష్టించి రూ.70కోట్ల భూమిని హస్తగతం చేసుకోవాలన్నది వారి పన్నాగం. మరి స్టీల్‌ప్లాంట్ భూమిని పరిరక్షించుకునేందుకు ప్లాంట్ ఉన్నతాధికారులు ఎంత గట్టిగా నిలబడతారు?.. ఈ కబ్జా బాగోతం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది.. ఇప్పుడు చర్చనీయాంశం. -
కేజీహెచ్‌లో మాస్టర్ ప్లాన్
అమలుకు 20న హైదరాబాదులో సమావేశం ఆస్పత్రిలో మంత్రి కామినేని బస వైద్య సేవలపై ఆరా విశాఖ మెడికల్: కేజీహెచ్‌లో మాస్టర్ ప్లాన్ అమలుకు ఆంధ్రప్రదేశ్వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) అధికారులతో ఈనెల 20న హైదరాబాదులో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో కలిసి కేజీహెచ్ మెన్స్ స్పెషాలిటీ వార్డులో శుక్రవారం రాత్రి బస చేసిన మంత్రి శనివారం ఉదయం కేజీహెచ్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అత్యవసర వైద్య విభాగంతోపాటు ప్రసూతి వార్డు, సూపర్‌స్పెషాలిటీ వార్డుల్లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సూపర్ స్పెషాలిటీ వార్డులో నిర్మాణంలో ఉన్న భవనం పనులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు, సదుపాయాల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పనిచేయని నాలుగు లిఫ్ట్‌లను వెంటనే బాగుచేయాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీనికి రూ.1.33కోట్లు అవసరమని ఆ సంస్థ ఈఈ ఉమేష్ కుమార్ మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో ఎన్టీయార్ వైద్య పథకం (ఆరోగ్యశ్రీ) ద్వారా వచ్చే ఆదాయాన్ని 50శాతం పెంచుకోవాలని మంత్రి వైద్యులకు సూచించారు. ఆయనను నర్సింగ్ విద్యార్థులు కలిసి ఉపకార వేతనాల బకాలయిలను చెల్లించాలని కోరారు. దీనిని పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య విద్యార్థులు, ప్రభుత్వ వైద్యులకోసం ఆస్పత్రి ఆవరణలోనే అల్పాహార క్యాంటీన్లు నిర్మించేందుకు ఆయన హామీ ఇచ్చారు. నర్సుల సంఘంనాయకులు, ప్రభుత్వ వైద్యుల సంఘంనేతలు మంత్రికి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌బాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ పి.వి.సుధాకర్, ఆర్ఎంవోలు డాక్టర్ శాస్త్రి, బంగారయ్య పాల్గొన్నారు. -
‘ఇన్ఫ్రా’ ఉత్పాదకత వృద్ధి అంతంతే
డిసెంబర్లో 2.4 శాతం మూడు నెలల కనిష్టస్థాయి ఇది... న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 2014 డిసెంబర్లో మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. వృద్ధి రేటు ఈ నెలలో 2.4 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, ఎరువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వృద్ధి రేటు 3 నెలల కనిష్టానికి పడిపోడానికి కారణం. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2013 డిసెంబర్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4 శాతం. 2014 నవంబర్‌లో 6.7 శాతం. 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్లో వేర్వేరుగా ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేట్లు ఇలా... వృద్ధిలో ⇒ బొగ్గు ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. ⇒ రిఫైనరీ వృద్ధి రేటు 6.1 శాతం వృద్ధి సాధించింది. ⇒ సిమెంట్ రంగం వృద్ధి రేటు 3.8 శాతం పెరిగింది. ⇒ విద్యుత్ రంగం వృద్ధి రేటు 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్లో 7.6 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. క్షీణతలో... ⇒ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -1.4 శాతం క్షీణత ⇒ సహజ వాయువు ఉత్పత్తి - 3.5 శాతం క్షీణించింది. ⇒ ఎరువుల రంగం - 1.6 శాతం క్షీణించింది ⇒ స్టీల్ ఉత్పత్తి - 2.4 శాతం పడింది. 9 నెలల్లో స్వల్ప వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.4 శాతానికి ఎగసింది. -
ఇన్ఫ్రా రంగానికి ఆర్బీఐ బూస్ట్
రుణ నిబంధనల్లో మరింత సడలింపు ముంబై: నిలిచిపోయిన మౌలిక రంగ ప్రాజెక్టులకు చేయూతనిచ్చేందుకు.. అదేవిధంగా బ్యాంకులు మొండిబకాయిల సమస్య నుంచి కొంతమేరకు గట్టెక్కేలా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న దీర్ఘకాలిక ప్రాజెక్టు రుణాలు, కీలక(కోర్) పరిశ్రమల రుణాల వ్యవస్థీకరణ(స్ట్రక్చరింగ్) నిబంధనలను సడలిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు 5:25 స్కీమ్‌ను విస్తృతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిప్రకారం... ప్రస్తుత దీర్ఘకాలిక ఇన్ఫ్రా ప్రాజెక్టులు, కోర్ ఇండస్ట్రీస్ విషయంలో రూ.500 కోట్లకుపైగా విలువైన రుణాలకు సంబంధించి బ్యాంకులకు రీఫైనాన్స్, స్ట్రక్చరింగ్‌లో మరింత వెసులుబాటు లభిస్తుందని ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అంటే 5:25 స్కీమ్ ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు బ్యాంకులు సంబంధిత రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు లేదంటే విక్రయిచేందుకు వీలవుతుంది. దీనివల్ల అటు బ్యాంకులతో పాటు ఇన్ఫ్రా కంపెనీలకూ ఇబ్బందులు తప్పుతాయి. కాగా, ఈ సదుపాయాన్ని అమలు చేయాలంటే... రుణ వ్యవధి 25 ఏళ్లకు మించి ఉండకూడదని, అదికూడా టర్మ్ లోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్బీఐ నిబంధనల విధించింది. అంతేకాకుండా ప్రాజెక్టు టర్మ్‌లోన్ లేదా రీఫైనాన్స్ చేసిన రుణం గనుక ఏ దశలోనైనా మొండిబకాయి(ఎన్పీఏ)గా మారితే... బ్యాంకులు భవిష్యత్తులో రీఫైనాన్సింగ్‌ను నిలిపేయడంతోపాటు తగినవిధంగా కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాలని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ మళ్లీ ఈ రుణం ఎన్పీఏ నుంచి బయటికొస్తే.. రీఫైనాన్సింగ్‌కు అర్హత లభిస్తుందని మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ ఏడాది జూలైలో ఆర్బీఐ ఇన్ఫ్రా, కీలక పరిశ్రమల ప్రాజెక్టులకు ఇచ్చే కొత్త రుణాలకు మాత్రమే స్ట్రక్చరింగ్‌లో సడలింపు ఇచ్చింది. అయితే, బ్యాంకులు ఇప్పటికే కొనసాగుతున్న దీర్ఘకాలిక ప్రాజెక్టులకూ దీన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూవచ్చాయి. తాజాగా డీసెంబర్ 2న జరిగిన పాలసీ సమీక్ష సందర్బంగా ఇన్ఫ్రా రంగానికి చేయూతనివ్వడం కోసం 5:25 స్కీమ్‌లో మార్పులు చేస్తూ రెండు కీలక చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. దీనికి అగుణంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. -
మేఘాకు ఎనర్షియా అవార్డు
హైదరాబాద్: ఇన్ఫ్రా సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (మేఘా)కు ప్రతిష్టాత్మకమైన ఎనర్షియా అవార్డు లభించింది. దక్షిణాదిలోనే తొలిసారిగా అనంతపురంలో వినూత్న టెక్నాలజీతో 50 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినందుకు గాను కంపెనీ ఈ పురస్కారం దక్కించుకుంది. న్యూఢిల్లీలో జరిగిన 8వ ఎనర్షియా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి తరుణ్ కపూర్ చేతుల మీదుగా మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పి.పి. రెడ్డి దీన్ని అందుకున్నారు. సంప్రదాయక ఫోటోవోల్టాయిక్ పద్ధతిలో కాకుండా అత్యంత సంక్లిష్టమైన కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ (సీఎస్పీ) విధానంలో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మేఘా డెరైక్టర్లు పి. రవిరెడ్డి, దొరయ్య, జనరల్ మేనేజర్ ఎన్ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.