మౌలిక రంగ నిర్మాణ సంస్థ బీఆర్ గోయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (BR Goyal Infrastructure) ఐపీఓ జనవరి 7న ప్రారంభమై 9న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.128–135గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.85.2 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇష్యూలో భాగంలో కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 63.12 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జనవరి 6న బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
పబ్లిక్ ఇష్యూ ముగిసిన తర్వాత బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తాన్ని మూల ధన వ్యయానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు, వృద్ధి ఆధారిత కార్యక్రమాలకు వినియోగిస్తామని కంపెనీ చైర్మన్ బ్రిజ్ కిషోర్ గోయల్ తెలిపారు. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్, రిజిస్ట్రార్‌గా లింక్ ఇన్‌టైం ఇండియా వ్యవహరిస్తున్నాయి.
క్వాడ్రాంట్ ఫ్యూచర్ కూడా అదే రోజునే..
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) కూడా ఈనెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.
ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఐపీవో బాటలో సన్‌షైన్ పిక్చర్స్
సినీ, టీవీ నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 83.75 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 50 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు.
ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ర. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి కార్యకలాపాలకు వినియోగించనుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల సృష్టి, అభివృద్ధి, నిర్మాణం, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను కంపెనీ ప్రధానంగా చేపడుతోంది. ఇప్పటికే 10 సినిమాలు నిర్మింంది. వీటిలో 6 మూవీలకు సహనిర్మాతగా వ్యవహరింంది. 2 వెబ్‌సిరీస్‌లు, 2 సీరియళ్లు సైతం కంపెనీ నుంచి వెలువడ్డాయి.
కంపెనీ నుంచి త్వరలో గుడ్ మార్నింగ్ రియా, గవర్నర్, కేరళ స్టోరీ2, బుల్‌డోజర్, సముక్, భీమ్ తదితర సినిమాలు రానున్నాయి. ఈ బాటలో మాయా, నానావతి వెర్సస్ నానావతి, విజిల్ బ్లోయర్ వెబ్‌సిరీస్ ప్రాజెక్టులు సైతం చేపట్టింది. ఈ ఏడాది(2024–25) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో రూ. 45 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment