price band
-
కొత్త ఐపీవో.. ఒక్కో షేర్ ధర రూ.128–135
మౌలిక రంగ నిర్మాణ సంస్థ బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (BR Goyal Infrastructure) ఐపీఓ జనవరి 7న ప్రారంభమై 9న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.128–135గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.85.2 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇష్యూలో భాగంలో కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 63.12 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జనవరి 6న బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.పబ్లిక్ ఇష్యూ ముగిసిన తర్వాత బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తాన్ని మూల ధన వ్యయానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు, వృద్ధి ఆధారిత కార్యక్రమాలకు వినియోగిస్తామని కంపెనీ చైర్మన్ బ్రిజ్ కిషోర్ గోయల్ తెలిపారు. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్, రిజిస్ట్రార్‌గా లింక్ ఇన్‌టైం ఇండియా వ్యవహరిస్తున్నాయి.క్వాడ్రాంట్ ఫ్యూచర్ కూడా అదే రోజునే..రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) కూడా ఈనెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐపీవో బాటలో సన్‌షైన్ పిక్చర్స్సినీ, టీవీ నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 83.75 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 50 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు.ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ర. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి కార్యకలాపాలకు వినియోగించనుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల సృష్టి, అభివృద్ధి, నిర్మాణం, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను కంపెనీ ప్రధానంగా చేపడుతోంది. ఇప్పటికే 10 సినిమాలు నిర్మింంది. వీటిలో 6 మూవీలకు సహనిర్మాతగా వ్యవహరింంది. 2 వెబ్‌సిరీస్‌లు, 2 సీరియళ్లు సైతం కంపెనీ నుంచి వెలువడ్డాయి.కంపెనీ నుంచి త్వరలో గుడ్ మార్నింగ్ రియా, గవర్నర్, కేరళ స్టోరీ2, బుల్డోజర్, సముక్, భీమ్ తదితర సినిమాలు రానున్నాయి. ఈ బాటలో మాయా, నానావతి వెర్సస్ నానావతి, విజిల్ బ్లోయర్ వెబ్‌సిరీస్ ప్రాజెక్టులు సైతం చేపట్టింది. ఈ ఏడాది(2024–25) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో రూ. 45 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో నిబంధనలు కఠినతరం
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఏ అంశాల ప్రాతిపదికన ఆఫర్ ధరను నిర్ణయించారన్న వివరాలను ఆఫర్ డాక్యుమెంట్, ప్రైస్ బ్యాండ్ ప్రకటనల్లో ’ఇష్యూ ధరకు ప్రాతిపదిక’ సెక్షన్ కింద వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది. ఇష్యూయర్లు ఇందుకోసం గతంలో జరిపిన నిధుల సమీకరణ, లావాదేవీలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వాటితో పాటు కీలక పనితీరు సూచికలను (కేపీఐ) ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో వివిధ సెక్షన్ల కింద ఇస్తున్నా.. ఆఫర్ డాక్యుమెంట్లలోని ఆర్థిక వివరాల సెక్షన్లలో ఉండటం లేదు. ఎటువంటి ట్రాక్ రికార్డు లేని కొత్త తరం కంపెనీలు పెద్ద యెత్తున ఐపీవోలకు వస్తుండటం, ఇన్వెస్టర్లు నష్టపోతుండటం జరుగుతున్న నేపథ్యంలో సెబీ శుక్రవారం బోర్డు సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడగలదని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. అలాగే ఐపీవో యోచనలో ఉన్న కంపెనీలు ఆఫర్ డాక్యుమెంట్లను ’ప్రీ–ఫైలింగ్’ చేసే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనకూ సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఇష్యూకి వచ్చే సంస్థలు తమ ఆఫర్ పత్రాలను బహిరంగ పర్చకుండా, ప్రాథమిక సమీక్ష కోసం సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలకు అందించాల్సి ఉంటుంది. ప్రీ–ఫైలింగ్‌తో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాసెసింగ్ విధానం కూడా ఇకపైనా కొనసాగుతుంది. మరిన్ని నిర్ణయాలు.. ► మ్యుచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలు, విక్రయాలను ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ప్రస్తుతం ఈ నిబంధనలు లిస్టెడ్ కంపెనీలు లేదా లిస్ట్ కాబోతున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తున్నాయి. ► మ్యుచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ లావాదేవీలకు కూడా రెండంచెల ధృవీకరణను సెబీ తప్పనిస రి చేసింది. ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమ ల్లోకి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ల విక్రయ సమయంలో ఆన్లైన్ లావాదేవీలకు టూ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను, ఆఫ్‌లైన్ లావాదేవీలకు సంతకం విధానాన్ని అనుసరిస్తున్నారు. ► ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విషయంలో నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు సంబంధించి కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం కనీసం 10 శాతం వాటా, కనిష్టంగా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్న పక్షంలోనే నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు ఓఎఫ్ఎస్లో పాల్గొనే వీలుంటోంది. ► పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల నిధులు, షేర్ల నిర్వహణకు సంబంధించి వివిధ టీమ్‌లు పోషించే పాత్రలు, బాధ్యతలు అలాగే రిస్కు నిర్వహణ విధానాలు మొదలైనవి రాతపూర్వకంగా ఉంచాలి. ► స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు, తొలగింపునకు కొత్త నిబంధనలను సెబీ ఆమోదించింది. వీటి ప్రకారం నియామకం లేదా తొలగింపునకు సాధారణ తీర్మానం, మైనారిటీ షేర్‌హోల్డర్ల మెజారిటీ తీర్మానం అంటూ రెండు పరామితులు ఉంటాయి. ► ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఓపెన్ ఆఫర్ ధర లెక్కింపు విధానంలో మార్పులు చేశారు. వీటి ప్రకారం రేటును లెక్కించేందుకు గత 60 ట్రేడింగ్ రోజుల వాల్యూమ్ వెయిటెడ్ సగటు మార్కెట్ రేటు (వీడబ్ల్యూఏఎంపీ)ను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిబంధనను తొలగించారు. ► క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. పరిశ్రమల వర్గీకరణ కోసం ప్రామాణిక విధానాన్ని పాటించాలన్న ఆదేశాల అమలుకు డెడ్‌లైన్‌ను సెబీ రెండు నెలల పాటు నవంబర్ 30 వరకూ వాయిదా వేసింది. -
కనీస ప్రైస్‌బ్యాండ్‌పై సెబీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుక్‌బిల్ట్ విధానంలో పబ్లిక్ ఇష్యూలకు కనీసం 5 శాతం ప్రైస్‌బ్యాండ్(ధరల శ్రేణి)ను ప్రతిపాదించింది. అంతేకాకుండా నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(ఎన్ఐఐలు)ను సబ్‌కేటగిరీలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశాలతోపాటు బుక్ బిల్డింగ్ మార్గదర్శకాలపై ప్రతిపాదనలు, వ్యాఖ్యానాలను ఆహ్వానించింది. 2021 అక్టోబర్ 20కల్లా వీటిని దాఖలు చేయవలసిందిగా సూచించింది. ఇటీవల పలు కంపెనీలు ఐపీవోల ధరల శ్రేణిలో కనిష్ట, గరిష్టాలను అతితక్కువగా నిర్ణయిస్తున్న నేపథ్యంలో సెబీ తాజా ప్రతిపాదనలు తీసుకువచ్చింది. పలు అంశాలలో ప్రైమరీ మార్కెట్ సలహా కమిటీ పలు అభ్యంతరాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ధరల నిర్ణయంలో పారదర్శక, నిజాయితీ విధానాల అమలు కనుమరుగవుతున్నట్లు అభిప్రాయపడినట్లు సెబీ పేర్కొంది. దీంతో బుక్ బిల్ట్ విధానంలో కనీసం 5 శాతం ప్రైస్‌బ్యాండ్ వ్యత్యాసాన్ని ప్రతిపాదించింది. ఎన్ఐఐలు ఇలా.. ఎన్‌ఐఐల విభాగంలో కొన్ని అతిపెద్ద సంస్థల నుంచే భారీ అప్లికేషన్లు దాఖలుకావడం ద్వారా రిస్కులు ఎదురవుతున్నట్లు సెబీ పేర్కొంది. 2018 జనవరి– 2021 ఏప్రిల్ మధ్య కాలంలో అత్యధిక స్పందన లభించిన ఐపీవోలను సెబీ విశ్లేషించింది. 29 పబ్లిక్ ఇష్యూలలో సగటున 60 శాతం ఎన్ఐఐలకు షేర్ల కేటాయింపు జరగనట్లు గుర్తించింది. ఏ ఐపీవోలోనైనా అందరికీ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీంతో రిటైల్, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ స్థాయిలో సమాన కేటాయింపులవైపు దృష్టిసారించినట్లు వెల్లడించింది. వెరసి ఎన్‌ఐఐలను రెండు కేటగిరీలుగా విభజించేందుకు ప్రతిపాదించింది. తొలి విభాగంలో రూ. 2–10 లక్షల మధ్య ఎన్ఐఐలకు మూడోవంతు కేటాయింపు ఉంటుంది. రెండో కేటగిరీలో రూ. 10 లక్షలకుపైన మూడోవంతు షేర్లకు వీలుంటుంది. చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
విస్తరణ బాటలో కిమ్స్ హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఐపీవో జూన్ 16న ప్రారంభం కానుంది. 18న ఇష్యూ ముగియనుంది. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ రూ.815–825గా నిర్ణయించారు. ఐపీవో ద్వారా రూ.2,144 కోట్లు సమీకరిస్తారు. ఫ్రెష్ ఇష్యూ రూ.200 కోట్లు ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 2.35 కోట్ల షేర్లను జారీ చేస్తారు. ఇందులో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ కేహెచ్ 1.60 కోట్ల షేర్లు, భాస్కర్ రావు బొల్లినేని 3.88 లక్షలు, రాజ్యశ్రీ బొల్లినేని 7.76 లక్షలు, బొల్లినేని రమణయ్య మెమోరియల్ హాస్పిటల్స్ 3.88 లక్షలు, ఇతరులకు చెందిన 60 లక్షల షేర్లున్నాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 75 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్‌కు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయిస్తారు. పొరుగు రాష్ట్రాలకు విస్తరణ.. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను మధ్య భారత్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సంస్థ విస్తరణకు వినియోగిస్తామని కిమ్స్ సీఈవో బొల్లినేని అభినయ్ తెలిపారు. ఎండీ భాస్కర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన మీడియాకు ఐపీవో వివరాలను వెల్లడించారు. హాస్పిటల్స్ బెడ్స్ సామర్థ్యం సైతం పెంచుతామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ప్రస్తుతం 9 ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తం పడకల సంఖ్య 3,064. కిమ్స్ 2020–21లో రూ.1,340 కోట్ల టర్నోవర్‌పై రూ.205 కోట్ల నికరలాభం ఆర్జించింది. కాగా, కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసే సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్లను నమోదు చేస్తారు. చదవండి: దొడ్ల ప్రైస్ బ్యాండ్ రూ. 421-428 -
ఏంజెల్ బ్రోకింగ్ ఐపీవో ధర రూ. 305-306
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఇష్యూ ఈ నెల 22న(మంగళవారం) ప్రారంభమై 24న(గురువారం) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్ బ్రోకింగ్ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్.. పబ్లిక్ ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం ఏంజెల్ బ్రోకింగ్ షేర్లను విక్రయించనుంది. తద్వారా ఈ నెల 21న నిధులు సమకూర్చుకోనుంది. ఐపీవోకు కనీస లాట్ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాగా.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం! -
ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.750–755
ముంబై: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రైస్‌బాండ్‌ను నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి మొదలై 5 వ తేదీన ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.750–755ను నిర్ణయించామని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగం గా 13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఇష్యూ సైజు రూ.9,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. కనీసం 19 షేర్లకు (మార్కెట్ లాట్)దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మార్చి 16న ఈ కంపెనీ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.325/330 రేంజ్ లో ఉందని సమాచారం. ఫిబ్రవరి 18 వ తేదీ వరకూ ఎస్బీఐ షేర్లను హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు–రిటైల్ కేటగిరీలోనూ, షేర్ హోల్డర్ల కేటగిరీలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. క్యూ3లో స్థూల మొండి బకాయిలు 2.47%గా ఉన్నాయని ఎస్బీఐ కార్డ్స్ సీఈఓ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. -
సౌదీ ఆరామ్కో ఐపీఓ సైజు 2,560 కోట్ల డాలర్లు !
రియాద్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్కో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా 1.5 శాతం వాటా (సుమారుగా 300 కోట్ల షేర్లు)ను విక్రయించనున్నది. ప్రైస్‌బ్యాండ్‌ను 30–32 సౌదీ రియాల్స్ (8–8,5 డాలర్లు–సుమారుగా రూ.576–612 రేంజ్లో)గా నిర్ణయించింది. ఈ ప్రైస్‌బ్యాండ్ పరంగా చూస్తే, సౌదీ ఆరామ్కో కంపెనీ విలువ 1.60–1.71 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్ కనిష్ట ధర పరంగా చూస్తే, 2,400 కోట్ల డాలర్లతో ఈ ఐపీఓ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఐపీఓ అవుతుంది. గరిష్ట ధర పరంగా చూస్తే, 2,560 కోట్ల డాలర్లతో ఇదే అతి పెద్ద ఐపీఓ అవుతుంది. ఇప్పటిదాకా అతి పెద్ద ఐపీఓ రికార్డ్ 2014లో వచ్చిన చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా పేరిట (2,500 కోట్ల డాలర్లు)గా ఉంది. కాగా ఇష్యూ ధరను వచ్చే నెల 5న నిర్ణయిస్తారు. డిసెంబర్ రెండో వారంలో ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. దేశభక్తికి నిదర్శనం ! ప్రస్తుతం సౌదీ అరేబియా(తాదవుల్) స్టాక్ ఎక్సే్చంజ్లోనే సౌదీ ఆరామ్కో షేర్లను లిస్ట్ చేస్తామని, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ఆలోచనేదీ లేదని సౌదీ ఆరామ్కో స్పష్టం చేసింది. ఈ ఐపీఓను విజయవంతం చేయడానికి సౌదీ అరేబియా అన్ని చర్యలు తీసుకుంటోంది. సంపన్న సౌదీ వ్యాపార కుటుంబాలు, ఫండ్స్ ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం దేశభక్తికి నిదర్శనమంటూ సౌదీవాసుల్లో ప్రచారమవుతోంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి పలువురు సౌదీ వాసులు ఇప్పటికే బ్యాంక్‌ల నుంచి రుణాలు తీçసుకున్నారని, కొందరైతే వ్యక్తిగత ఆస్తులను కూడా అమ్మేశారని సమాచారం. -
30 నుంచి ఐఆర్సీటీసీ ఐపీఓ
ముంబై: ప్రభుత్వ రంగ ఐఆర్సీటీసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే నెల 3న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.315–320గా నిర్ణయించామని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వెల్లడించింది. ఈ ఐపీఓ ఇష్యూ సైజు రూ.645 కోట్లు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తంలో 1,60,000 షేర్లను ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.10 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఈ షేర్లు వచ్చే నెల 14న లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ సర్వీసెస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యస్ సెక్యూరిటీస్ (ఇండియా) వ్యవహరిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా లభించే సొమ్ములను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రుణాల చెల్లింపునకు, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు. -
సూపర్ మార్కెట్ లీడర్ ’డీమార్ట్’ ఐపీవో
ముంబై: రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ , సూపర్ మార్కెట్ లీడర్ డీమార్ట్ త్వరలో ఐపీవోకి రానుంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న డీమార్ట్ మార్చి 8న పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. మార్చి 10న ముగియనున్న ఇష్యూకి రూ. 290-299 ప్రైస్ బ్రాండ్‌గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా రూ. 1,810-1866 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 6.23 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 1.87 కోట్ల షేర్లను విక్రయించనుంది. మరో 1.24 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్), 93.59 లక్షల షేర్లను సంపన్న వర్గాలకు రిజర్వ్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 2.18 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. ఇష్యూ తరువాత డీమార్ట్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. ఈ ఇష్యూకు గ్లోబల్ కోఆర్డి నేటర్‌గా, లీడ్ మేనేజర్ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వ్యవహరిస్తోంది. ఇతర లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంగా కాపిటల్, జెఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ క్యాపిటల్ అడ్వైజర్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి. కాగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యధిక శాతం స్టోర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల తెలుగు రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తోంది. సుమారు 120 స్టోర్లను ఇప్పటికే నిర్వహిస్తున్న సంస్థ 2016 మార్చికల్లా రూ. 8,600 కోట్ల అమ్మకాలతో 320 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 5.72 ఈపీఎస్ నమోదైంది. గత రెండేళ్లలో కంపెనీ లాభార్జన సగటున 31 శాతం చొప్పున జంప్‌చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.6 ఈపీఎస్‌ను కంపెనీ అంచనా వేస్తోంది. ఇష్యూ ధర రూ. 300కాగా.. 40 పీఈలో షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
ప్రభాత్ డైరీ ఐపీఓ ప్రైస్‌బాండ్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి తగిన స్పందన లేకపోవడంతో ప్రభాత్ డైరీ సంస్థ తన ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను తగ్గించింది. అంతేకాకుండా ఐపీఓను మరో మూడు రోజులు పొడిగించింది. ప్రైస్‌బాండ్‌ను రూ.140-147 నుంచి రూ.115-126కు తగ్గించామని, రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌కు రూ.5 డిస్కౌంట్ ఇస్తామని కంపెనీ తెలిపింది. గత నెల 28న ప్రారంభమైన ఈ ఐపీఓ మంగళవారంతో ముగియాల్సి ఉంది. దీనిని ఈ నెల 4 వరకూ కంపెనీ పొడిగించింది. ఈ ఐపీఓ 28 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. -
నవకార్ ప్రైస్‌బాండ్ రూ.147-155
ఈ నెల 24 నుంచి 26 మధ్య ఐపీఓ న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ సంస్థ నవ్కార్ కార్పొరేషన్ తన ఐపీఓకు ప్రైస్‌బాండ్‌ను నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభమై 26న ముగిసే ఈ ఐపీఓకు రూ.147-155 ధరల శ్రేణిని ప్రైస్‌బాండ్‌గా నిర్ణయించామని సోమవారం తెలిపింది. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా తాజాగా షేర్లు జారీ చేసి రూ.510 కోట్లు, ప్రస్తుతమున్న షేర్లను రూ.90 కోట్లకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.600 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 95 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 95 గుణిజాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండిగో, కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ వంటి సంస్థలు త్వరలో ఐపీఓకు రానున్నాయి.